ర్యాలీలు, సభలకు నో పర్శిషన్
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు మంగళవారం వెలువడిన తర్వాత ర్యాలీలు, సభలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
- వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా
కాశీబుగ్గ, జూన్ 3: వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు మంగళవారం వెలువడిన తర్వాత ర్యాలీలు, సభలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రాంగణంలో సోమవారం పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ విభాగాలకు చెందిన 400 మంది పోలీస్ అధికారులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఎంపీ అభ్యర్థులు, సంబంధిత ఏజెంట్లు, ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని, ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. డీసీపీలు రవీందర్, అబ్దుల్ బారీ, అదనపు డీసీపీ రవి, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

