దారుణం.. ధర్మసాగర్లో వ్యక్తిని కొట్టి చంపారు

వరంగల్ : జిల్లాలోని ధర్మసాగర్ గ్రామంలో సోమవారం ఓ వ్యక్తిని తన ప్రత్యర్థులు దారుణంగా కొట్టి చంపారు. మృతుడిని ఎస్సీ కాలనీకి చెందిన చింతా అశోక్(35)గా గుర్తించారు. రేషన్ దుకాణానికి సరుకులు తీసుకుని వెళ్లేందుకు వచ్చిన అశోక్‌ను షాపు సమీపంలో ఇద్దరు వ్యక్తులు కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావమై అశోక్ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. కాజీపేట ఏసీపీ రవీందర్ కుమార్, ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ రమేశ్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పాతకక్ష్యలే ఇందుకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

