ఆంధ్రకు గోదావరి జలాలు.. తెలంగాణకు తీరని అన్యాయం : గంగం సతీష్ రెడ్డి
స్వరాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకో గలిగామని సర్పంచుల ఫోరం బచ్చన్నపేట మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.
బచ్చన్నపేట నవంబర్ 29 : స్వరాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకో గలిగామని సర్పంచుల ఫోరం బచ్చన్నపేట మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ మండలం యశ్వంతపూర్ లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన దీక్షా దివస్ కి బచ్చన్నపేట మండలం నుండి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలను ఆంధ్రకు తరలిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మ రించిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ హయంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సకల జనులను ఏకం చేసిన ఘనత కేసిఆర్ కే దక్కింది అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఉద్యమం ఉర్రూతలూగిందన్నారు. కానీ నేటి పాలకులు ఆ రాష్ట్రంలో పదవులు అనుభవిస్తున్న తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చల్లా శ్రీనివాస్ రెడ్డి, ముసిని రాజు గౌడ్, దూడల కనకయ్య గౌడ్, కోనేటి స్వామి, కొండి వెంకటరెడ్డి, బొమ్మన ఆంజనేయులు, తిరుపతి, భానుచందర్, శ్రీశైలం, కరుణాకర్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, రవికుమార్, కిష్టయ్య, అల్వాల ఎల్లయ్య, శ్రీనివాస్, బాల సిద్ధులు, ఆజాం, నాగలక్ష్మి, ఉపేందర్ రెడ్డి, షబ్బీర్, నీల మురళి, కరిక కరుణాకర్, కనకయ్య, రమేష్, హరి ప్రసాద్, రాధ, రవీందర్, అనిల్ రెడ్డి, బాల్ రెడ్డి, సిద్ధారెడ్డి, రాజనర్సు, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

