నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు : సీపీ
శివరాత్రి పండుగ సందర్భంగా నగరంలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
సుబేదారి, మార్చి 7 : శివరాత్రి పండుగ సందర్భంగా నగరంలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ములుగు, పరకాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పెద్దమ్మగడ్డ, కేయూసీ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్ మీదుగా హనుమకొండ బస్‌స్టేషన్‌కు చేరుకోవాలన్నారు. హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి నర్సంపేట, తొర్రూరు, భద్రాచలంకు బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్డు మీదుగా వెళ్లాలన్నారు.
వరంగల్ బస్‌స్టేషన్ నుంచి చింతల్ బ్రిడ్జి, రంగశాయిపేట, నాయుడు పెట్రోల్ పంపు, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం మీదుగా హనుమకొండ బస్‌స్టేషన్‌కు చేరుకోవాలన్నారు. ములుగు రోడ్డు నుంచి కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు అలంకార్ నుంచి కాపువాడ మీదుగా హనుమకొండ బస్‌స్టేషన్ వైపు వెళ్లాలన్నారు. హనుమకొండ నుంచి వరంగల్ వైపు కార్లు, బైక్‌లు, ఆటోలు మర్కజీ రోడ్డు, కొత్తూరు జెండా, అమృత్ జంక్షన్ నుంచి యాదవనగర్ ద్వారా పెద్దమ్మగడ్డ నుంచి వెళ్లాలన్నారు. వేయి స్తంభాల ఆలయం వద్ద, అమృత్ జంక్షన్ నుంచి అలంకార్ వరకు రోడ్డుపై వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదన్నారు. ప్రయాణికులు, వాహనదారులు, భక్తులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

