తెలంగాణే ఆయన ధ్యాస.. శ్వాస..
‘మా వనరులు మాకున్నాయి.. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసించే దశకు తెలంగాణ రావాలె! మా తెలంగాణ మాగ్గావాలె!!’ అంటూ తెలంగాణే ధ్యాస, శ్వాసగా తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే అంకితం చేశారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్.
- నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి
- జయశంకర్ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏకశిల పార్కులో ఏర్పాట్లు
- పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
‘మా వనరులు మాకున్నాయి.. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసించే దశకు తెలంగాణ రావాలె! మా తెలంగాణ మాగ్గావాలె!!’ అంటూ తెలంగాణే ధ్యాస, శ్వాసగా తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే అంకితం చేశారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్.
విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలపై తీవ్రంగా పోరాటం చేయడంతో పాటు నాన్ ముల్కీ, 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద విశ్వవిద్యాలయాలు, ఇతర సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినిపించారు. ‘అబ్తో ఏక్ హీ ఖ్వాహిష్ హై, వో తెలంగాణ దేఖ్నా.. ఔర్ మర్జానా’ అని తరచూ చెప్పే ఆయన చివరకు తెలంగాణ ఏర్పాటును కళ్లారా చూడకుండానే జూన్ 21, 2011లో కన్నుమూశారు.
హనుమకొండ, జూన్ 21 : తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమస్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 13వ వర్ధంతిని జయశంకర్ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సభ్యు లు తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యాన వనం(ఏకశిల పార్కు)లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆరు దశాబ్దాలపాటు తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన గొంతుకను వినిపించిన జయశంకర్ సార్‌ను స్మరించుకోనున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ట్రస్టు సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

