ఎక్స్ టెన్షన్!
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)లో వారి జోడీ బంధం చాలా బలంగా నాటుకుపోయింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వారి హవానే కొనసాగుతున్నది. వారు ఎంత చెబితే అంత అన్నట్లుగా ఏదైనా వారి కనుసన్నల్లోనే జరిగేది. అయితే, ఇటీవల వారి జోడీ వీడిపోయింది. ఇద్దరు అధికారుల్లో ఒకరు ఉద్యోగ విరమణ పొందగా, మరొకరు మరి కొన్ని నెలల్లో రిటైర్ కానున్నారు.
- కుడాలో ఇద్దరు అధికారుల పదవీ కాలం పొడిగింపునకు యత్నాలు
- ఉద్యోగ విరమణ పొందిన, పొందనున్న వారి కోసం పైరవీలు
- ముందస్తు ఎక్స్టెన్షన్పై ఓ ప్రజాప్రతినిధి అభ్యంతరం
- వెనక్కి తగ్గిన ఉన్నతాధికారులు
వరంగల్, మే 16 : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)లో వారి జోడీ బంధం చాలా బలంగా నాటుకుపోయింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వారి హవానే కొనసాగుతున్నది. వారు ఎంత చెబితే అంత అన్నట్లుగా ఏదైనా వారి కనుసన్నల్లోనే జరిగేది. అయితే, ఇటీవల వారి జోడీ వీడిపోయింది. ఇద్దరు అధికారుల్లో ఒకరు ఉద్యోగ విరమణ పొందగా, మరొకరు మరి కొన్ని నెలల్లో రిటైర్ కానున్నారు. అయితే ఉద్యోగ విరమణ పొందిన అధికారిని ఎక్స్టెన్షన్ పేరిట మళ్లీ కుడా కార్యాలయానికి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పనిలోపనిగా మరికొన్ని నెలల్లో విరమణ పొందనున్న మరో కీలక అధికారి ముందస్తు ఎక్స్టెన్షన్ కోసం సైతం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎక్స్టెన్షన్ వస్తుందన్న ఆశతో ఉన్న అధికారి నెల రోజుల క్రితం విరమణ పొందినా ఆయనకు కార్యాలయంలో ఎలాంటి సన్మాన కార్యక్రమాలు చేయలేదు. ‘మళ్లీ వస్తాను.. ఇప్పుడే ఎందుకు’ అంటూ వద్దన్నట్లు కార్యాలయంలో చర్చించుకుంటున్నారు.
ముందస్తు ఎక్స్టెన్షన్ కోసం సిఫారసు
కుడా కార్యాలయంలో ఆ ఇద్దరు అధికారుల జోడీ బంధం కలిసి ఉండేలా ఉన్నతాధికారులు సైతం సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల రోజుల క్రితం రిటైర్ అయిన ఇంజినీరింగ్ అధికారి ఎక్స్టెన్షన్ కోసం సిఫారసు లేఖతోపాటు మరో ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ చేసే కుడాలోని కీలక అధికారికి సైతం ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఉద్యోగ విరమణ పొందని అధికారికి ముందస్తుగానే ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ఉన్నతాధికారి సిఫారసు చేయడమేమిటంటున్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని దశాబ్దాల కాలంగా సదరు అధికారుల జోడీ కుడా కార్యాలయంలో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారనే విమర్శలున్నాయి.
ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొంది నెల రోజులు కాకుండానే సదరు ఇంజినీర్ ఎక్స్టెన్షన్ కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం విస్మయం కలిగిస్తున్నది. దీంతో పాటు జోడీ కలిసి ఉండేలా ముందస్తు సిఫారసు చేసుకోవడం కుడా కార్యాలయానికే చెల్లుతుంది. అయితే ఈ వ్యవహారంపై జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అభ్యంతరం చెప్పినట్లు కుడాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కుడా చైర్మన్గా పనిచేసిన సదరు ప్రజాప్రతినిధి ఉద్యోగ విరమణకు ఆరు నెలల సమయమున్నా అధికారికి ఇప్పడే ఎక్స్టెన్షన్ కోసం సిఫారసు చేయడమేంటని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో కుడా ఉన్నతాధికారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తున్నది. ఉద్యోగ విరమణ పొందిన ఇంజినీర్ ఎక్స్టెన్షన్ లేఖను మాత్రమే ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

