నువ్వా.. నేనా?
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్నది. మొదటి రోజు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో హోరాహరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా ఓట్లు నమోదవుతున్నాయి.
- బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య టఫ్ ఫైట్
- నల్లగొండలో కొనసాగుతున్న కౌంటింగ్
- మొదలైన పట్టభద్రుల ఓట్ల లెక్కింపు
- తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు సుధీర్ఘ సమయం
- తొలి రౌండ్‌కే ఏడు గంటల సమయం
- నేడు మధ్యాహ్నం 2గంటల వరకు పూర్తయ్యే అవకాశం
- గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ రౌండ్
- ఇదే జరిగితే తుది ఫలితం తేలేది రేపే
నల్లగొండ ప్రతినిధి, జూన్ 5(నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్నది. మొదటి రోజు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో హోరాహరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా ఓట్లు నమోదవుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి వరకు జరిగిన తొలి రౌండ్ కౌంటింగ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మూడు రౌండ్ల కౌంటింగ్‌లో ఫలితం ఎవరి వైపు ఉంటుందోనని తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి తొలి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటా ఎవ్వరికీ వచ్చే అవకాశాలు లేవని కౌంటింగ్ కేంద్రంలోని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఎలిమినేషన్ రౌండ్లో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఎలిమినేషన్ రౌండ్ నిర్వహించాల్సి వస్తే శుక్రవారం ఉదయానికి గానీ తుది ఫలితం వెలువడే అవకాశాలు లేవు.
ఉదయం 8 గంటలకు మొదలు
నల్లగొండ పట్టణ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాంల్లో బుధవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందనా దీప్తి, ఎన్నికల పరిశీలకులు రాహుల్ బొజ్జ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్‌ను ఓపెన్ చేశారు. మొత్తం నాలుగు హాల్స్‌లో కౌంటింగ్ చేస్తున్నారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం ఏకకాలంగా నాలుగు హాల్స్‌లో 96 టేబుళ్లపై కౌంటింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11గంటల వరకు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగింది. దాదాపు ఒక్క రౌండ్‌కు కనీసం ఏడు గంటల సమయం తీసుకుంది. అంటే ఇంకా తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు సంబంధించి మూడు రౌండ్ల లెక్కింపు జరుగాల్సి ఉంది. ఒక్కో రౌండ్‌కు కనీసం ఐదు గంటల సమయం తీసుకున్నా గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇద్దరి మధ్య హోరాహోరీ
మొత్తం 96టేబుళ్లపై కౌంటింగ్‌లో కొన్ని టేబుళ్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మెజార్టీ చూపుతుండగా మరికొన్ని టేబుళ్లపై కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యాన్ని చూపుతున్నట్లు సమాచారం. దీంతో తొలి రౌండ్‌తో ఎటూ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నట్లు అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు చెప్పుకొచ్చారు. ఇక మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, నాల్గో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. వీరితో పాటు ఐదో స్థానంలో చెల్లని ఓట్లే ఉండనున్నట్లు కౌంటింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి గణనీయంగా చెల్లని ఓట్ల సంఖ్య ఉన్నట్లు సమాచారం. ఇవి ఎవరి కొంప ముంచుతున్నాయనేది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో తొలి రౌండ్‌తో కలిపి మిగతా రౌండ్లల్లోనూ ఇంతే టఫ్‌గా ఓట్లు పోలైతే తొలి ప్రాధాన్యత ఓట్లలో విజేత తేలకపోవచ్చు.
ఎలిమినేషన్ రౌండ్ తప్పదా..
తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక గెలుపు కోటా నిర్ధారిస్తారు. చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్లను పరిగణలోకి తీసుకుంటూ అందులో 50శాతం ప్లస్ ఒకటిని గెలుపు కోటాగా నిర్ణయిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ ఈ గెలుపు కోటా రాకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఎలిమినేషన్ రౌండ్లో చేపడతారు. ఇది జరుగాల్సి వస్తే గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాతనే జరుగనుంది. ఎలిమినేషన్ రౌండ్లో తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ వచ్చిన అభ్యర్థి నుంచి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇది పూర్తి కావాలంటే కనీసం మరో 12గంటల సమయం తీసుకుంటుంది. ఇదే జరిగితే శుక్రవారం ఉదయానికి తుది ఫలితం వెలువడవచ్చని భావిస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

