ఎన్నో చెప్పారు ఏమిచ్చారు ?
“వరంగల్‌పై ఇక స్పెషల్ ఫోకస్ పెడతా. హైదరాబాద్‌తో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దుతా. ఇందుకోసం రూ.6,115 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశాం. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సత్వరమే భూసేకరణ చేపట్టాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలి. తాగునీటి సరఫరా పైప్‌లైన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి. 2050 సంవత్సరానికి అనుగుణంగా వరంగల్ మాస్టర్‌ప్లాన్ డిజైన్ చేయాలి.”
- బడ్జెట్లో ఓరుగల్లుపై రేవంత్ సర్కారు చిన్నచూపు
- స్పెషల్ ఫోకస్ అంటూనే పద్దు కేటాయించని వైనం
- ఉమ్మడి జిల్లాకు దక్కని నిధులు
- టెక్స్టైల్ పార్కు ప్రస్తావనే లేదు
- వరంగల్ నగర అభివృద్ధికీ నిధుల్లేవు
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీపైనా దాటవేత
- యూనివర్సిటీల ప్యాకేజీలో కేయూకు నిధులు
- ఎకో టూరిజం సర్క్యూట్లో చోటు
- కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం సర్క్యూట్
“వరంగల్‌పై ఇక స్పెషల్ ఫోకస్ పెడతా. హైదరాబాద్‌తో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దుతా. ఇందుకోసం రూ.6,115 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశాం. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సత్వరమే భూసేకరణ చేపట్టాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలి. తాగునీటి సరఫరా పైప్‌లైన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి. 2050 సంవత్సరానికి అనుగుణంగా వరంగల్ మాస్టర్‌ప్లాన్ డిజైన్ చేయాలి.”
– గత నెల 29న వరంగల్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కేంద్ర బడ్జెట్ తరహాలోనే రాష్ట్ర బడ్జెట్లోనూ వరంగల్ ఉమ్మడి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర బడ్జెట్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఎలాంటి ప్రత్యేకనిధులు కేటాయించలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపైనా బడ్జెట్లో ప్రస్తావించలేదు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలుచేయాల్సిన వాటికీ నిధులు ఇవ్వలేదు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా ఉన్న వరంగల్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి బడ్జెట్లో రూ.10వేల కోట్లు కేటాయించగా వరంగల్ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు.
నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీలో ప్రకటించింది. రాష్ట్ర బడ్జెట్లో దీనికి అవసరమైన నిధులను కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సీఎం రేవంత్‌రెడ్డి గత నెల 29న వరంగల్‌లో పర్యటించినప్పుడు సమగ్ర అభివృద్ధి కోసం రూ.6115 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. ఇన్నర్, ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణాల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. స్మార్ట్‌సిటీ మిషన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు(డీపీఆర్) సిద్ధం చేయాలని చెప్పారు. తాగునీటి సరఫరా పైప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కానీ బడ్జెట్లో మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు.
కీలకమైన పనులకు మోక్షం కరువు
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన టెక్స్టైల్ పార్కు పనులు చివరి దశలో ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలు స్థాపించేందుకు అనుగుణంగా టెక్స్టైల్ పార్కును త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులపైనా బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు. టెక్స్టైల్ పార్కులో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తేనే పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విద్యారంగంలో కీలకమైన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అభివృద్ధి కోసం రూ.500 కోట్లను మాత్రం బడ్జెట్లో పేర్కొన్నారు.
ప్రతిపాదనల ఆధారంగా ఆయా వర్సిటీలకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని ఏకైక వైద్య విద్య విశ్వవిద్యాలయం వరంగల్‌లోనే ఉన్నది. బడ్జెట్లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నిర్వహణ కోసం రూ.2 కోట్లు కేటాయించారు. ఎస్సారెస్పీ వరద కాలువకు రూ.265 కోట్లు, దేవాదులకు రూ.248 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1676 కోట్లు కేటాయించారు. మధ్యతరహా ప్రాజెక్టులలో పాకాలకు రూ.5కోట్లు, రామప్పకు రూ.5కోట్లు, లక్నవరం సరస్సుకు రూ.2కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. ఎకో టూరిజం ప్రాజెక్టు కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసానితో పాకాల, ఏటూరునాగారం ప్రాంతాలను అనుసంధానం చేసి అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది.
ఆదివాసీలకు అన్యాయం
ములుగు రూరల్ : బడ్జెట్ కేటాయింపులో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానించింది. దానిని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆదివాసీ గిరిజనులు, గిరిజన సంక్షేమ కోసం మొత్తం బడ్జెట్లో 10 శాతం ప్రకారం రూ. 29,115 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 6 శాతం రిజర్వేషన్‌ను పరిగణలోకి తీసుకొని రూ.17,056 కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.12,059 కోట్లకు ఎగ్గొట్టింది. సమీకృత గిరిజనాభివృద్ధి, ఆరోగ్యం, అటవీ హక్కుల చట్టాలను పరిరక్షిస్తామని తన మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చి ఆదివాసీ ఓట్లను దండుకొని గద్దెనెక్కిన అనంతరం విస్మరించడం దారుణం. ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్‌ను నేరుగా ఐటీడీఏ ద్వారా ఖర్చు చేయాలి.
– వట్టం ఉపేందర్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

