నయీంనగర్, డిసెంబర్ 18 : నిట్‌లో మూడు రోజులుగా నిర్వహించిన టెక్నోజియాన్ ఆదివారం ముగిసింది. చివరి రోజు పలు ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చి 65 ఈవెంట్లను తిలకించారు. టెక్నోజియాన్ కొత్త ఆవిష్కరణలకు నాంది పలికిందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తామూ కూడా ఈవెంట్లను ప్రదర్శిస్తామని వారు తెలిపారు. సాంకేతికోత్సవంతో నిట్ ప్రాంగణం అంతా సందడిగా మారింది.
నిట్‌లో గాలిలో ఎగురుతున్న డ్రోన్లు
నేడు ఆన్లైన్లో పేమెంట్
ఈవెంట్లలో విజయం సాధించిన విద్యార్థులకు ఆదివారం సాయంత్రం రూ.20 లక్షల నగదు బహుమతి అందించాల్సి ఉంది. కానీ, విజేతల జాబితా తయారీకి సమయం లేకపోవడంతో సోమవారం మధ్యాహ్నం వరకు విజేతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఫ్యాకల్టీ అడ్వైజర్ ప్రొఫెసర్ ఆనంద్‌కిశోర్ తెలిపారు.
నొప్పి ఎలా తట్టుకుంటున్నారో..
అమ్మాయిలకు వచ్చే పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిని ఎలా తట్టుకుంటున్నారో అర్ధం కావడం లేదు. అమ్మాయిలకు వచ్చే నొప్పి ఏ విధంగా ఉంటుంది అని టూ ఫీల్ ద చైర్ ఈవెంట్లో అబ్బాయిలకు తెలిసే విధంగా చేశారు. అయితే ఆ నొప్పి ఏ విధంగా ఉంటుందో అని చూశాను, అది అబ్బాయిలు తట్టుకోలోని పరిస్థితి ఉంది. వారు 10 లెవల్ వరకు పెడితే నేను 7వ లేవల్ వరకు వచ్చే నొప్పినే తట్టుకోలేకపోయాను.
– దివాకర్
ఈవెంట్లు ఎంతో ఉపయోగం..
టెక్నోజియాన్ సందర్భంగా అనేక ఈవెంట్లు ప్రదర్శించారు. ఇవి విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరంగా. ఎప్పుడు పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాకుండా ఇటువంటి కొత్త కొత్త ప్రయోగాలు చేయడం వల్ల కూడా మంచి భవిష్యత్ ఉంటుందని అర్థం అవుతుంది. ఇటువంటి ఈవెంట్లను ప్రోత్సహించడంతో మాలాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం.
– కమలాకర్
మీలో కుడా టాలెంట్ ఉంది..
మాలోనే కాదు చూసేవారిలో కూడా టాలెంట్ ఉందని గ్రహించాలి. అందుకోసమే ఈ టెక్నోజియాన్‌లో ద పిట్ స్టాప్, ర డీ టూ రేస్ వంటి వాటిని 25 మంది విద్యార్థులం కలిసి తయారు చేశాం. ఈ సంవత్సరం ఆగస్టులో నోయిడా, ఢిల్లీలో సుద్ర అనే ఈవెంట్లో పాల్గొని జాతీయ స్ధాయిలో17వ స్ధానం సాధించాం. ఇతరులను ప్రోత్సహించేందుకే ఈ ఈవెంట్లను ప్రదర్శించాం.
– మిథిలేశ్, మెకానికల్ ఇంజినీర్
ఈవెంట్లకు మంచి స్పందన
టెక్నోజియాన్‌ను పురస్కరించుకుని నిట్‌లో ఇనాగ్రీత్, కంట్రోల్డ్ వర్క్‌షాపు, టెక్క్విజ్, తదితర ఈవెంట్లను ప్రదర్శించాం. వీటికి మంచి స్పందన వచ్చింది. తిలకించిన వారు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. విజేతలకు ఉచితంగా కిట్లను అందజేశాం.
–వర్షిత, మెకానికల్ ఇంజినీరింగ్
భయం పోయింది..
నిట్‌లో టెక్నోజియాన్ సందర్భంగా హనిభ నెట్ వర్క్‌ను మా స్నేహితులతో కలిసి చేశాం. అయితే, ఈ ఈవెంట్లో పాల్గొనడం వల్ల నాలో ఉన్న భయం పూర్తిగా పోయింది. విద్యార్థులకు ఇటువంటి ఈవెంట్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
– శ్రీనిధి, మెకానికల్, మహబూబాబాద్
మంచి విషయాలు నేర్చుకున్నాం..
ఈ ఈవెంట్లతో ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం. ఇటువంటి వాటితో మనం కూడా ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన కలిగింది. ఇటువంటి కొత్త ఆవిష్కరణల ద్వారా చూసే వారికి మరింత ఉత్సాహం పెరిగింది. రానున్న రోజుల్లో ఈవెంట్లకు మరింత ప్రోత్సాహం అవసరం.
– సిద్ధి, హైదరాబాద్
ప్రత్యేక కారు తయారు చేశాం..
టెక్నోజియాన్‌లో ప్రత్యేకంగా ఉండేందుకు మా టీం సభ్యులందరం కలిసి ప్రత్యేకమైన కారును తయారు చేశాం. తయారు చేసిన కారును చూసేందుకు వచ్చిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానాలు చెప్పాం. చూసిన వారికి తమలో మరింత ధైర్యం, ఆత్మైస్థెర్యం ఏర్పడింది. ఇంతలా విజయవంతం కావడానికి మాటీం సభ్యులు సహకారం ఎంతో ఉంది. – సంజన