నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 29తో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29న షెడ్యూల్ విడుదల చేయగా, నేడు నోటిఫికేషన్ జారీ చేయనుంది.
- వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియ షురూ
- 10 వరకు నల్లగొండలో నామినేషన్ల స్వీకరణ.. 27న ఎన్నికలు
- 12 జిల్లాల్లో 24,905 మంది ఉపాధ్యాయ ఓటర్లు
నల్లగొండ, ఫిబ్రవరి 2 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 29తో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29న షెడ్యూల్ విడుదల చేయగా, నేడు నోటిఫికేషన్ జారీ చేయనుంది.
నల్లగొండ కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తూ ఈ నెల 10 వరకు ఉదయం 11 నుంచి మధ్యా హ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నా రు. ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని అభ్యర్థులు నల్లగొండలో నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 11న స్క్రూటినీ, 13న ఉపసంహరణ, అనంతరం 27న పోలింగ్ నిర్వహించి, మార్చి 3న ఫలితాలను లెక్కించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల యంత్రాంగం జిల్లాలో 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ఆయా పోలింగ్ కేంద్రాల్లో 24,905 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు.
నల్లగొండలోనే ఓట్ల లెక్కింపు..
నల్లగొండ ఆర్జాలబావిలోని గిడ్డంగుల సంస్థ గోదాము లో కౌంటింగ్‌కు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఉ మ్మడి వరంగల్ – ఖమ్మం-నల్లగొండ జిల్లాల్లో మొత్తం 12 జిల్లాలుండగా నల్లగొండ కలెక్టర్ ఆర్వోగా, ఇతర జిల్లాల కలెక్టర్లు ఏఆర్వోలుగా వ్యవహరించనున్నారు. మొత్తం 24,905 మంది ఉపాధ్యాయులుండగా, నల్లగొండలో 4,48 3, సూర్యాపేటలో 2,637, యాదాద్రిలో 921, సిద్దిపేటలో 163, జనగామలో 921, హనుమకొండలో 5,098, వరంగల్‌లో 2,225, మహబూబాబాద్‌లో 1,618, భూపాలపల్లి లో 323, ములుగులో 612, భద్రాద్రిలో 1,949, ఖమ్మంలో 3,955 మంది ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

