హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 8 : వరంగల్ నిట్‌లో నిర్వహిస్తున్న స్ప్రింగ్ స్ప్రీ విద్యార్థుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. రెండోరోజు శనివారం విద్యార్థులు ఈవెంట్లను ప్రదర్శించారు. ఉదయం నుంచి రా త్రి వరకు విద్యార్థులు కల్చరల్ ఫెస్టివల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మైక్రో ఆర్ట్, నిట్ చెఫ్స్, నిట్ గాట్ టాలెంట్, ఇన్వెస్టో ట్యాంక్, కరోకే, ఎడిట్ మై రా, తోలుబొమ్మలాట, లేజర్ అమేజ్, పోలా ర్డ్ స్టాల్, చెస్ ఫీస్టా, అనిమీ మ్యూజియం, కోమిక్ ఎగ్జిబిషన్, బంగాజ నీడిల్ క్రాఫ్ట్, ప్లానిటోరియం, ఆర్గామి, ఐపీఎల్ యా క్షన్, మిస్సీరీ హంట్, ఫుడ్ ఫెస్టా, ఆస్ట్రో టైంలైన్, పొట్రీ మేకింగ్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, పిక్ అండ్ పేస్ట్, నైట్ మేనేజర్, ఛేస్ యువర్ టార్గెట్, హ్యాండ్ ప్రింట్ కాలేజీ, ట్రై ఓ బ్యాటిల్, మర్డర్ మహీమ్, నోటబుల్ అల్యూమిని టాక్స్, సాండ్ ఆర్ట్, క్యూ ఫ్యాక్టర్, కల్చరల్ డ్యాన్స్, బైక్ షో, ఎన్జీటీ విన్నర్స్, పిక్చర్స్ సీసన్, ఐడోల్స్ బ్యాండ్, పత్సావ్ బ్యాండ్, ప్రో షోలో గాయకులు కోస్తేటా, అసీమ్శర్మ అలరించారు. అలాగే డీజే వన్మూన్, మిడ్నైట్ మెహఫిల్ ఈవెంట్లను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈవెంట్లలో పాల్గొని ప్రతిభను చాటారు.
టెక్నాలజీతో లేజర్ మేజ్ ప్రదర్శన..
నిట్‌లోని ఈ అండ్ ఐసీటీలో నిర్వహించిన లేజర్ మేజ్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంది. తరగతి గదిలో ఏర్పాటు చేసిన లేజర్ లైట్స్‌ను తాకకుండా పై నుం చి వెళ్లాల్సి ఉంటుంది. లేజర్ లైట్‌కు తగిలితే వెంటనే సౌండ్ వస్తుంది. భాను, యశ్వంత్, శరత్చంద్ర, భవాని విద్యార్థులు నూతన టెక్నాలజీని వినియోగించి ఈవెంట్‌ను ప్రదర్శించారు. విద్యార్థులు మెదళ్లకు పనిచెప్పి ఈవెంట్‌ను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా లేజ్ మేజ్లో పాల్గొన్నారు.
బైక్‌లతో డిఫరెంట్ స్టంట్స్..
విద్యార్థులు బైక్ స్టంట్స్ అందరినీ అబ్బురపరిచాయి. బైకులతో విన్యాసాలు చేస్తూ ఔరా అనిపించారు. చూస్తున్నవారికి సైతం ఒళ్లు గగుర్పొడిచేవిధంగా బైకులతో స్టంట్స్ చేశారు. బైక్ స్టంట్స్ చేస్తున్న వారిని ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొట్టారు. కేరింతలతో ఉత్సాహాన్ని నింపారు. బైక్స్ పై విద్యార్థులు డిఫరెంట్ స్టంట్స్ చేస్తూ అదరహో అనిపించారు.
సాండ్ ఆర్ట్ : ప్రముఖ ఇసుక కళాకారుడు సుధాకాంత్ సాండ్ ఆర్ట్ అందరినీ ఆకట్టుకుంది. రంగస్థల కళలో ఆయన అనేక ప్రాంతాల్లో కోటలు, భారతదేశ ప టం, తెలంగాణ మ్యాప్‌ను ఇసుకతో అనేక కళలను ప్రదర్శించాడు. తోలు బొమ్మల కళను రాజస్థాన్‌కు చెందిన శ్రీ జితు జాగా ప్రదర్శించారు. ఒరేటరీ క్లబ్ నిర్వహించిన కరోకే ఈవెంట్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి పార్టిసిపెంట్‌కు ఏదైనా టాపిక్‌పై తన ఆలోచనలను వ్యక్తీకరించడానికి లేదా పాడడానికి మూడు నిమిషాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చాలామంది విద్యార్థులు భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అంబేదర్ లెర్నింగ్ సెంటర్ బీ సుధీర్‌రావు బృందం నృత్యాన్ని ప్రదర్శించింది.
గాట్ ట్యాలెంట్ : విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి కొంత సమయం ఇస్తారు. ఈ టాలెంట్ ఈవెంట్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు.
ఎడిట్ మై రా : పాల్గొనేవారు ముడి చిత్రాన్ని, సవరించిన చిత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని సమర్పణల్లో, మొదటి కొన్ని బాగా సవరించిన చిత్రాలకు అవార్డులు అందజేస్తారు.
మర్డర్ మేహెమ్ : సంఘటనలు ప్రారంభమయ్యే ముందు ఒక కథ వివరిస్తారు. క్లూస్ ఆధారంగా పాల్గొనేవారు హత్య ఎవరు (హంతకుడి పేరుతో చిట్) చేశారు అని తెలుసుకోవడానికి క్యాంపస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మిడ్నైట్ మెహఫిల్తో విద్యార్థులు వివిధ పాటలకు నృత్యా లు చేస్తూ పాడుతూ కార్యక్రమాలు ముగించారు. మైక్రోఆర్ట్, హ్యాండ్ ప్రింట్, కుండల తయారీ, ఒరిగామి వంటి ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
నేడు ముగియనున్న స్ప్రింగ్ స్ప్రీ
స్ప్రింగ్స్ప్రీలో భాగంగా మూడో రోజు డైలాగ్ డెలివరీ, హ్యాండ్ టు హ్యాండ్, ఎక్సామెన్ ఫిసికోమెట్రికో, కిరిగామి, స్కావెంజర్ హంట్, ఫిల్మ్ ల్యాండ్, చేస్ యువర్ టార్గెట్, డైరెక్టర్ దాస్యం తరుణ్‌భాస్కర్‌తో ఇంటరాక్షన్, ప్రో షో(మోహన్ సిస్టర్స్) ఈవెంట్లతో పాటు కరోకే, హ్యాండ్స్ప్రింగ్, ఒరిగామి, మైక్రో ఆర్ట్ కొనసాగనుంది. ఈవెంట్ల ప్రదర్శన అనంతరం స్ప్రింగ్ స్ప్రీ ముగియనుంది.