కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే హక్కు లేదు..
ఇచ్చిన హామీలు అమ లు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే నైతిక హక్కు లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం ఆమె డోర్నకల్ పట్టణం లో బీఆర్ఎస్ నాయకుడు మాన్యుపాట్ని నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు.
- స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం
- మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
డోర్నకల్, నవంబర్ 30 : ఇచ్చిన హామీలు అమ లు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే నైతిక హక్కు లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం ఆమె డోర్నకల్ పట్టణం లో బీఆర్ఎస్ నాయకుడు మాన్యుపాట్ని నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన త ర్వాత డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గా ల్లో అభివృద్ధి శూన్యమన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క టీ నెరవేర్చలేదన్నారు.
మహలక్ష్మీ పథకం ద్వారా రూ.2,500, రైతు భరోసా రూ.15వేలు, కల్యాణలక్ష్మి తులం బంగారం, రెట్టింపు పింఛన్లు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే మహిళలకు చీరెలు పంపిణీ చేశారని అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా బీసీలకు రాలేదన్నారు. ఎమ్మెల్యేలు రాంచంద్రూనాయ క్, మురళీనాయక్ ప్రజలను ఏవిధంగా ఓటు అడుగుతారో చెప్పాలన్నారు.
చుట్టం చూపులా నియోజకవర్గానికి వచ్చి వెళ్లే ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్కు డోర్నకల్ నియోజకవర్గం గురించి ఏం తెలుసన్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి డోర్నకల్ ప్రజలకు అభివృద్ధి పథకాలు అందించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీచైర్‌పర్సన్ అంగోత్ బిందు, మాజీ సర్పంచ్ బా నోత్ పాండూనాయక్, బీఆర్ఎస్ నాయకులు మాన్యుపాట్నీ, యశోధర్ జైన్, రాంభద్రం, రఘు, చంటి, శ్రీనివాస్, హూన్యానాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

