సమస్యలపై ఉద్యోగుల జంగ్
ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27న హనుమకొండ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి నోటీసు అందజేశారు.
- 27న జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా
- హనుమకొండ కలెక్టర్‌కు నోటీస్ అందజేత
హనుమకొండ, ఆగస్టు 22 : ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27న హనుమకొండ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా జాక్ నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ముఖ్యంగా పీఆర్సీ, పాత పెన్షన్ పునరుద్ధరణ, ఆరు డీఏలు, పూర్తి స్థాయిలో ఎంప్లాయీస్ హెల్త్ సీమ్, పెండింగ్ బిల్లుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఒత్తిడి తీసుకొచ్చేందుకు దశల వారీగా కార్యాచరణ తీసుకున్నామని, అందులో భాగంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 27న కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో ధర్నా చేస్తున్నామని, పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. నోటీసు ఇచ్చిన వారిలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్ మోహన్‌రావు,
జేఏసీ కార్యదర్శి, టీజీవోస్ అధ్యక్షుడు ఆకవరపు శ్రీనివాస్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్య నాయక్, పీఆర్టీయూ అధ్యక్షుడు ఎం తిరుపతిరెడ్డి, టీఎన్జీవోస్ కార్యదర్శి బైరి సోమయ్య, టీఎస్‌యూటీఎఫ్ కార్యదర్శి పెండెం రాజు, టీపీటీఎఫ్ అధ్యక్షుడు శ్రీరామాంజనేయులు, రావుల రమేశ్, డీటీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేశ్, మాధవరెడ్డి, సలీం, రాజమౌలి, లక్ష్మీప్రసాద్, శ్యాంసుందర్, బింగి సురేశ్, రాజేశ్వర్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, అనూప్, ప్రణయ్, మాలకొండారెడ్డి, నికిల్, శ్రీనివాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

