హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 3: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా హనుమకొండ కాకతీయ హరిత హోటల్లో నిర్వహించిన ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, ప్రముఖ బ్యాంకుల ద్వారా స్టాళ్లు ఏర్పాటు చేయగా శుక్ర, శనివారాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్టాళ్లను పెద్ద సంఖ్యలో సందర్శించి వివిధ ప్రాంతాల్లోని వెంచర్లు, అపార్ట్మెంట్లు, ఇళ్లు, బ్యాంకుల ద్వారా అందే రుణాల గురించి అడిగి తెలుసుకున్నారు.
సొంతిల్లు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు కొనాలకునేందుకు ఈ షో చక్కని వేదికగా నిలిచిందని వారు తెలిపారు. ప్రాపర్టీ తీసుకునే సమయంలో ఉండే అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. ప్రాపర్టీ షో నిర్వహించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు కృతజ్ఞతలు తెలిపారు. లక్కీడ్రా ద్వారా కస్టమర్లకు గిఫ్ట్స్ అందజేశారు.
టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, కార్యదర్శి బైరి సోమయ్య, కేంద్ర సంఘం నాయకులు శ్యాంసుందర్, రామునాయక్, జిల్లా నాయకులు రాజేశ్‌ఖన్నా, మల్లేశం, మెహబూబ్, కుమార్, టీఎన్జీవోస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంకిషన్, కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ వీరగంటి రవీందర్ సందర్శించి స్టాళ్లను పరిశీలించారు. నమస్తే తెలంగాణ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్, బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, అడ్వర్టయిజ్మెంట్ డిప్యూటీ మేనేజర్ అప్పని సూరి పాల్గొన్నారు.
కాజీపేట దర్గారోడ్ నిట్ సమీపంలో పాంచజన్య డెవలపర్స్ ద్వారా అనురాగ్-99 అపార్ట్మెంట్ ఐదు ఫ్లోర్లతో అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. గేటెడ్ కమ్యూనిటీ, స్విమ్మింగ్‌పూల్, లగ్జరీరూమ్స్, బాంక్వెట్‌హాల్, సోలార్, 2బీహెచ్‌కే 1100-1535 ఫీట్ల ఏరియాలో అందరికీ అందుబాటులో లభిస్తున్నాయి. వరంగల్‌లో భూములకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. సామాన్యులకు అందుబాటులో అందిస్తున్నాం.
– ఎర్రబెల్లి తిరుపతిరెడ్డి, క్రెడాయి బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించడం చాలా బాగుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పలు కంపెనీల స్టాళ్లలో వివరాలు తెలుసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి అవకాశం కల్పించారు. వరంగల్ అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో ఇక్కడ సైతం ప్రాపర్టీ షోకు మంచి స్పందన వచ్చింది.
– గుడివెనక దేవేందర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రాపర్టీ షో ద్వారా అన్ని నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులను ఒకేచోటకు తీసుకురావడం బాగుంది. అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇండ్లు కొనుక్కునే ప్రతి ఒక్కరికీ ఇది మంచి అవకాశం. అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందామని వచ్చాం.
– సీతామహాలక్ష్మి, బాలసముద్రం
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆర్థికంగా నిలబడేందుకు అందరికీ మంచి అవకాశాన్ని కల్పించాయి. ఎవరైనా ప్రజలను మోసం, దగా చేయకుండా కుడా అప్రూవ్డ్ లే అవుట్లు చేయాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమ్మకాన్ని కలిగించాలి. డీసీసీబీ తరఫున స్టాళ్లను ఏర్పాటు చేశాం. సహకార బ్యాంకు ద్వారా రైతులకు వ్యవసాయ భూములకు, ఇల్లు కట్టుకోవడానికి రుణాలు అందిస్తున్నాం. రియల్ ఎస్టేట్, వెంచర్స్, ఇండిపెండెంట్ హౌస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఓపెన్ ప్లాట్స్‌కు డీసీసీబీ ద్వారా రుణాలు లభిస్తున్నాయి.
– మార్నేని రవీందర్రావు, డీసీసీబీ చైర్మన్
ప్రజలకు నమ్మకమైన ప్లాట్లు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రాపర్టీ షో ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు వరంగల్‌లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు భారీగా ప్రాపర్టీ షోకు తరలివచ్చి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచి కార్యక్రమాన్ని ప్రజలు ప్రోత్సహిస్తున్నారు.
– ఆకుల రాజేందర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు
బాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు గృహ రుణాలను 8.40శాతం వడ్డీతో ఇస్తున్నాం. ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీ వారితోపాటు ప్రముఖ సెంట్రల్ బ్యాంకులు ఒకే వేదికపైకి తీసుకురావడం వల్ల ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం కలిగింది.
– డి.కిరణ్‌కుమార్, బ్యాంక్ ఆఫ్ బరోడా, వరంగల్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో సామాన్యులకు ఒక వేదికగా నిలిచింది. సొంతింటి కలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్యాంకర్ల నుంచి లోన్లు ఇప్పించడం బాగుంది. ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని నిర్వహించింది.
– ఎంఏ బారి, సెంట్రల్‌జోన్ డీసీపీ
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రాపర్టీ షో ప్రజలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. ప్రజలకు నమ్మకం కలిగించేలా అన్నీ ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు మోసాలకు గురికాకుండా నమ్మకంగా ఉండేలా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల కోసం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు.
– బయ్య శ్రీధర్, సందర్శకుడు
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో ద్వారా సొంతింటి కల నెరవేరుతుంది. వరంగల్‌లో భూములకు ఇప్పుడు మంచి ధరలు ఉన్నాయి. ఇల్లు కొనేవారికి తగిన జాగ్రత్తలు చూసుకుంటున్నారు. ఇల్లు తీసుకునేందుకు బ్యాంకు అధికారుల సహకారంతో లోన్లు ఇప్పించేందుకు మంచి వేదికను ఏర్పాటు చేశారు.
– శ్రీనివాస్, సామాజికవేత్త
ప్రాపర్టీ షో చేపట్టడం చాలా బాగుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు పట్టణాలపై మక్కువ ఎక్కువ కావడం వల్ల ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలో మోసపోకుండా ఇలాంటి కార్యక్రమం ద్వారా అవగాహన పెరుగుతుంది.
– వీరగంటి రవీందర్, మాజీ కార్పొరేటర్