వ్యాపార రంగంలో మహిళలకు ప్రోత్సాహం
వ్యాపార రంగంలో గ్రామీణ మహిళలు రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
- ఉపాధి కోసం రూ.20వేల కోట్ల రుణాలు
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగురూరల్, జూలై 9 : వ్యాపార రంగంలో గ్రామీణ మహిళలు రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్, క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి సొంత నిధులతో జిమ్‌ను ఏర్పాటు చేయగా మంగళవారం ఎంపీ పోరిక బలరాంనాయక్, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్లు శ్రీజ, మహేందర్‌జీతో మంత్రి కలిసి ప్రారంభించారు. ములుగు నుంచి పత్తిపల్లి వరకు దేవగిరిపట్నం మీదుగా రూ. 6.56 కోట్లతో 5.5 కిలోమీటర్ల మేర చేపడుతున్న రోడ్డు పునరుద్ధరణ పనులు, కలెక్టరేట్లో దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు, ఇద్దరు ట్రాన్స్జెండర్లకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహిళలకు ఉపా ధి కల్పించేందుకు రూ. 20వేల కోట్ల రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు.
రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రానున్న ఐదేళ్లలో మహిళల ఆర్థికాభివృద్ధి పెంపొందించేందుకు వడ్డీలేని రుణ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు అందించే వస్తువులు నాణ్య తా ప్రమాణాలు పాటించాలని, లేకపోతే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే అంగన్వాడీ టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ సమయంలో సాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్ డిప్యూటీ సీఎం వద్ద ఉందన్నారు. ఎంపీ బలరాంనాయక్ మా ట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం మంత్రి సీతక్క ద్వారా ములుగు ప్రాంతంలో మొట్టమొదటి సారిగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇంచర్ల గ్రామానికి చేరుకొని ఫంక్షన్ హాల్లో 50మంది ప్ర భుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్, డీడబ్ల్యూవో స్వర్ణలతలెనినా పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

