రైతు బీమా ప్రీమియం కట్టకుంటే ఉద్యమం.. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం
రైతు బీమా ప్రీమియం కట్టాలని, లేకపోతే రైతుల పక్షాన ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ నా యకుడు మాన్యు పాట్నీని ఆదివారం డోర్నకల్‌లో ప రామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మరిపెడ మండలం వెంకంపాడు కాంగ్రెస్ సర్పంచ్ ఉప్పల సోమన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా,
- మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
డోర్నకల్, ఆగస్టు 23 : రైతు బీమా ప్రీమియం కట్టాలని, లేకపోతే రైతుల పక్షాన ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ నా యకుడు మాన్యు పాట్నీని ఆదివారం డోర్నకల్‌లో ప రామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మరిపెడ మండలం వెంకంపాడు కాంగ్రెస్ సర్పంచ్ ఉప్పల సోమన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబానికి రెండెకరాల భూమి ఉన్నప్పటికీ రైతు బీమా పథకం అందకపోవడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమన్నా రు. కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని, ఇంటికి వెళ్లి ఆలోచన చేయాలని కేసీఆర్ ప్రజలకు విడమర్చి చెప్పినా ఆ పార్టీకి ఓటు వేసి ఇప్పుడు గోసపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని విమర్శించారు. పిచ్చోడి చేతిలో రాయిలా సీఎం రేవంత్‌రెడ్డి పాలన ఉందని అన్నారు. కేసీఆర్ పాలనలో లక్షల మంది రైతులకు రైతుబంధు, రైతు భీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మీ పథకం ఆసరాగా నిలిచిందన్నారు.
కాంగ్రెస్ సర్కారు వీటితో పాటు తులం బంగారం ఇవ్వకుండా మంగళం పాడిందన్నారు. రేవంత్‌రెడ్డి చిల్లర పంచాయితీలతో కాలం గడుపుతున్నాడని, రూ. కోట్లు అవినీతి చేసి తమ్ముళ్లకు, అల్లుడుకు కట్టబెడుతున్నట్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనను తిడుతున్నట్లు చెప్పారు. కల్వకుంట్ల కవిత మాటలకు కాంగ్రెస్ నాయకులు స్పందించడం కాదు.. దమ్ముంటే మంత్రి కొండా సురేఖ బిడ్డ సుస్మిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. నర్సంపేటలో తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరెడ్డి కూల్చివేశారని విమర్శించారు. డోర్నకల్ ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలవుతుందన్నారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కర్రు కాల్చి వాత పెడతామన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మ వెంకటరెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ మాజీ మెంబర్ మారబోయిన రాంభద్రం, బీఆర్ఎస్ నాయకుడు బోడ శ్రీను పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

