రైతులను మోసం చేసిందే కాంగ్రెస్
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు ఇవ్వకుండా మోసం చేసిందని, ఆ పార్టీని మళ్లీ నమ్మి ఓట్లు వేస్తే మోసపోతామని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని బొడ్డుచింతలపల్లి, వంచనగిరి, శాయంపేట గ్రామాల్లో మంగళవారం ఆన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- 24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ను గెలిపించుకుందాం
- హస్తం పార్టీ గ్యారెంటీలపై ప్రజలకు నమ్మకం లేదు
- కర్ణాటక ప్రజలను ఆ పార్టీ మోసం చేసింది
- ల్యాండ్ పూలింగ్ అపోహ వద్దు
- కాంగ్రెస్ వస్తే మళ్లీ గ్రామాల్లో గొడవలే..
- ఎన్నికల ప్రచారంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుగొండ/దామెర, నవంబర్ 21: కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు ఇవ్వకుండా మోసం చేసిందని, ఆ పార్టీని మళ్లీ నమ్మి ఓట్లు వేస్తే మోసపోతామని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని బొడ్డుచింతలపల్లి, వంచనగిరి, శాయంపేట గ్రామాల్లో మంగళవారం ఆన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించగా, వారు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి ఆగం కావొద్దని, 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని కోరారు. ఒక్కఛాన్స్ పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేయటానికి కాంగ్రెస్ మీ ముందుకొస్తున్నదని, నమ్మితే ఆగమైతారన్నారు. కర్ణాటక ప్రజలు హస్తం పార్టీని నమ్మి ఓటేస్తే కరెంటు ఇవ్వకుండా మోసం చేసిందని గుర్తు చేశారు. టెక్స్టైల్ పార్కు కోసం 13 వందల ఎకరాల భూమిని సేకరించామన్నారు. పార్కులో త్వరలో ప్రారంభమయ్యే కిటెక్స్ కంపెనీలో 11 వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు.
గీసుగొండలో రౌడీల గొడవ లేకుండా పదేళ్ల నుంచి ప్రశాంతంగా ఉందని, మళ్లీ ఆ పరిస్థితి రానివ్వొద్దని కోరారు. శాయంపేట రైతులు టెక్స్టైల్ పార్కు కోసం తమ భూములను ఇచ్చి త్యాగం చేశారని, వారందరికీ పార్కులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే ల్యాండ్ పూలింగ్ చేస్తారనే ప్రతిపక్షల ఆరోపణల్లో నిజం లేదన్నారు. మీ బిడ్డగా ముందుకొస్తున్నానని, మీరు ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కేదాసి అనిల్, ఎంపీటీసీ కాయిత భిక్షపతి, సొసైటీ చైర్మన్ కొల్లూరి రవీందర్, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, నాయకులు యుగేంధర్, కొల్పుల కట్టయ్య, కొండా వెంకన్న, శ్రీనివాస్, ముంత రాజయ్య, కొంగర రవి, కొంగర చంద్రమౌళి, అక్తర్ పాషా, రాజు, చంటి, అజార్మున్నా, కిశోర్‌కుమార్, బాబురావు పాల్గొన్నారు. అలాగే, దామెర మండలంలోని ఊరుగొండ, దామెరలో చల్లా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

