Sand Lorry | మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో ఇసుక అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారం ఇప్పటికే తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అక్రమ ఇసుక మాఫియాకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకులపై పోలీసులు గతంలో కేసులు కూడా నమోదు చేశారు. ములుగు ఇసుక మాఫియా బీభత్సం సృష్టిస్తోంది.
హై స్పీడ్లో ఉన్న ఓ ఇసుక లారీ ములుగు జిల్లా పస్రా – తాడ్వాయి మధ్య అటవీ శాఖ చెక్పోస్ట్ సమీపంలో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఇసుక లారీ CRPF జవాన్లు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టి.. ఆగకుండా వెళ్లి రెవెన్యూ శాఖకు చెందిన కారును కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు CRPF జవాన్లు మృతి చెందగా.. మరో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరారైన లారీ డ్రైవర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
మంత్రి సీతక్క ఇలాకాలో ఇసుక మాఫియా బీభత్సం
ప్రమాదంలో ఇద్దరు CRPF జవాన్లు మృతి
ములుగు జిల్లా పస్రా – తాడ్వాయి మధ్య అటవీ శాఖ చెక్పోస్ట్ సమీపంలో రెండు వాహనాలను ఢీకొట్టిన ఇసుక లారీ
CRPF జవాన్లు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టి ఆగకుండా వెళ్లి, రెవెన్యూ శాఖకు చెందిన కారును ఢీకొట్టిన లారీ
ప్రమాదంలో ఇద్దరు CRPF జవాన్లు మృతి, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులకు తీవ్ర గాయాలు
పరారైన డ్రైవర్ కోసం గాలిస్తున్న పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2026
Uttarpradesh: టీ కోసం దాబా వద్ద ఆగారు.. 8 ఏళ్ల కొడుకును వదిలేసి 80 కిలోమీటర్ల దూరం వెళ్లారు
Paddy Crop | జనరేటర్ పెడితే రోజుకు రూ.3-4 వేలు ఖర్చు.. పశువులకు మేతగా వరి పంట.. వీడియో