నయీంనగర్, జూన్ 20 : మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై ఎమ్మెల్యేలు గరం అయ్యారు. గురువా రం మాజీ ఎమ్మెల్సీ కొండా ముర ళి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారా ణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఎవరైనా సరే పార్టీకి కట్టుబడి ఉండాలి. పార్టీ గీత దాటి, ఏం చేసినా నడుస్తుంది అన్నట్టు వ్యవహరిస్తే సహించేది లేదు, హద్దులు దాటి ప్రవర్తిస్తే ఊరుకోం, రానున్న రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి ఇలా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్ సమయంలో ఇలా మాట్లాడటం సరైంది కాదు, ఏమై నా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలని గతంలోనే మీటింగ్‌లో అనుకున్న సంగతి మర్చిపోయి, సీనియర్లు ఎక్కడ పడితే అక్కడ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదు.
నచ్చింది చే స్తాం, నచ్చింది మాట్లాడుతాం అంటే ఇక్కడ నడవదని, కులం కార్డు అడ్డం పెట్టుకుంటాం అంటే ఇక్కడ నడువదు, ఇక్కడ కార్డులు పని చేయవ్ ఇక్కడ అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని జాతు ల వారు ఉన్నారు, చేసిన పాపాలకు కులం అడ్డుపెట్టుకుంటే పోతాయా.. ఆ పద్ధతి మార్చుకోవాలి. కష్టం, సుఖం దేనికైనా పార్టీ ఉంది అధిష్టానానికి చెప్పుకోవాలి అంతేకానీ ప్రతి దానికి రోడ్లపై ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదు. త్వరలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. నియోజకవర్గాల్లో కష్టపడి తిరుగుతుంటే ఇలా చేయడం సరైంది కాదు, ఎక్కువ సేపు ఇలా ఉంటే మోయలేం. తక్కువ టైంలోనే సమస్యకు పరిష్కారం చూపెడుతా’మని స్పష్టంచేశారు.