ఖిలావరంగల్, జనవరి 8 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 34వ డివిజన్ నుంచి కాంగ్రెస్ ముఖ్యనాయకులు, పలు సంఘాల మహిళలు, యూత్ నాయకులు భారీగా ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నామని రాజ్‌కుమార్‌తో పాటు డివిజన్‌కు చెందిన జారతి దేవి ఆధ్వర్యంలో మహిళా సంఘం సభ్యులు సునీత, కృష్ణవేణి, రమాదేవి, స్వప్న, రాధ, అనిత, పార్వతి, రాధిక, సుజాత, అనసూయ, రజిత, అరుణ, శోభారాణి, భారతమ్మ, యాకలక్ష్మి, రాజమణి, సులోచన, ముత్యాలు, ప్రశాంతి, సంధ్యారాణి, స్వర్ణలత, అరుణ, డివిజన్‌కు చెందిన యూత్ నాయకులు పృథ్వీ, రాకేశ్, వినయ్, సందీప్, వంశీ, అఖిల్, సిద్ధు, రేవంత్, సాయి, తరుణ్, వెంకటేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తాను నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రాంత బిడ్డగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నానన్నారు. అందులో భాగంగా రూ.1100 కోట్లతో మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే, రూ.75 కోట్లతో అధునాతన బస్టాండ్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి ఏడు గురుకులాలు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సొంత ఖర్చుతో రేషన్‌బియ్యం అందించినట్లు చెప్పారు. పేద విద్యార్థులకు అండగా ఉండాలని పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. తనను కడుపులో పెట్టుకొని ఈ స్థాయికి తీసుకొచ్చిన నియోజకవర్గ, శివనగర్ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, డివిజన్ అధ్యక్షుడు సతీశ్, యూత్ నాయకులు అవినాష్, విద్యాసాగర్, ఇందిరా, మహేందర్, నూతన్, సునీత, అక్షిత్, కుమార్, ప్రతాప్ పాల్గొన్నారు
కరీమాబాద్ : గ్రేటర్ వరంగల్ 12, 42వ డివిజన్ల సమస్యలు, బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంపై ఫోర్టురోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమీక్ష నిర్వహించారు. 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ డివిజన్లలోని ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టి, మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ అభివృద్ధి కలిసికట్టుగా పని చేయాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను నాయకులు సత్కరించారు. అలాగే, 12వ డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకులు కొత్తపెల్లి కిరణ్, గొల్లపెల్లి మహేశ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కలసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, 12వ డివిజన్ అద్యక్షుడు సోల రాజు, 42వ డివిజన్ అధ్యక్షుడు కర్ర కుమార్, కొంతం మోహన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.