Thank You Subbarao | ఓ.. పిట్టకథ, అన్నపూర్ణ ఫొటో స్టూడియో ఫేం డైరెక్టర్ చెందు ముద్దు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ‘థాంక్యూ సుబ్బారావు’. చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకూర, మురళీధర్ గౌడ్, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌ను లాంచ్ చేయగా మంచి స్పందన వస్తోంది.
భావోద్వేగాలు, అనుబంధాలు, మరువలేని క్షణాలతో కూడిన ఒక కథ మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.. అంటూ నయా అప్డేట్ను షేర్ చేశారు. ఈ మూవీ పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో జూన్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
యాక్షన్, కామెడీ, లవ్, సస్సెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు టీజర్ ద్వారా హింట్ ఇచ్చేశారు మేకర్స్. మురళీధర్ గౌడ్ యాక్టింగ్ సినిమాకు హైలెట్‌గా నిలువబోతున్నట్టు టీజర్లో వచ్చే డైలాగ్స్ చెబుతున్నాయి. ఈ మూవీని కే రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. ఈ మూవీకి హెన్రీ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
A story filled with emotions, relationships, and unforgettable moments is ready to reach your screens!#ThankYouSubbarao starts streaming on @ahavideoIN from June 18th.https://t.co/17nwDcPvq1
Don’t miss this heartwarming entertainer!#ThankYouSubbaraoOnAha@KurraP68246… pic.twitter.com/a0W59i8sFu
— Gautam Yarramsetty (@mrgyvcofficial) June 15, 2026
Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్