పైన పటారం.. లోన లొటారం..
రంగులతో అందంగా కనిపిస్తున్న ఈ భవనం కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలది. దీనిని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లిలో కొత్తగా నిర్మించారు. జీ ప్లస్ టూతో దీనిని చేపట్టగా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. గ్రౌండ్, మొదటి అంతస్తులో పనులు పూర్తి చేసినప్పటికీ రెండో అంతస్తును మాత్రం అలాగే వదిలేశారు.
- పనులు పూర్తికాని ముప్పనపల్లి కేజీబీవీ
- నేడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క
రంగులతో అందంగా కనిపిస్తున్న ఈ భవనం కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలది. దీనిని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లిలో కొత్తగా నిర్మించారు. జీ ప్లస్ టూతో దీనిని చేపట్టగా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. గ్రౌండ్, మొదటి అంతస్తులో పనులు పూర్తి చేసినప్పటికీ రెండో అంతస్తును మాత్రం అలాగే వదిలేశారు. పూర్తయిన గదుల్లో బెంచీలు, బెడ్స్ లేవు. కనీసం విద్యార్థుల సామగ్రి భద్రపర్చుకునేందుకు ఏర్పాట్లు చేయలేదు. సీలింగ్ ఫ్యాన్లు కూడా సరిగా లేవు. పాఠశాలకు కాంపౌండ్ వాల్‌తో పాటు గేట్ ఏర్పాటు చేయలేదు. కానీ, అధికారులు మాత్రం పాఠశాల ముందు భాగాన్ని ముస్తాబు చేసి శనివారం మంత్రి సీతక్కతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. విద్యార్థినుల నుంచి ఉపాధ్యాయుల వరకు అందరూ మహిళలే ఉండే ఈ పాఠశాలను అరకొర వసతులతో ప్రారంభించొద్దని, మంత్రి సీతక్క ఈ విషయమై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
– కన్నాయిగూడెం, జూలై 12
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

