మినీ మేడారానికి ముహూర్తం ఖరారు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మ క్క-సారలమ్మల మినీ జాతర ఫిబ్రవరిలో జరుగనున్నది. ఇటీవల అమ్మ వార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు పూజారులు మినీ జాతర తేదీలను నిర్వహించేందుకు సమావేశమయ్యారు
- ఫిబ్రవరి 1 నుంచి నాలుగు రోజుల పాటు జాతర
- ప్రకటించిన పూజారులు
- మినీ జాతరలో వన దేవతలను గద్దెలకు తీసుకురావడం
- మినహా యథావిధిగా పూజలు
తాడ్వాయి, నవంబర్29: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మ క్క-సారలమ్మల మినీ జాతర ఫిబ్రవరిలో జరుగనున్నది. ఇటీవల అమ్మ వార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు పూజారులు మినీ జాతర తేదీలను నిర్వహించేందుకు సమావేశమయ్యారు. అమ్మవార్లకు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర(మండమెలిగే పండుగ) నిర్వహిస్తారు. ఈ మినీ జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసు కురావడం మినహా మిగతా పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగు తాయి.
మేడారంలోని సమ్మక్క పూజా మందిరంలో కొక్కెర కృష్ణయ్య, కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరంలో కాక సారయ్య, అమ్మవార్ల పూజారులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మినీ జా తరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నిధులను మంజూరు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

