చెక్కుచెదరని మేడిగడ్డ బరాజ్
ఎగువ నుంచి వస్తున్న లక్షల క్యూసెక్కుల భారీ వరదను సైతం తట్టుకొని మేడిగడ్డ బరాజ్ చెక్కుచెదరకుండా ఉందని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు అన్నారు.
మహదేవపూర్, జూలై 22: ఎగువ నుంచి వస్తున్న లక్షల క్యూసెక్కుల భారీ వరదను సైతం తట్టుకొని మేడిగడ్డ బరాజ్ చెక్కుచెదరకుండా ఉందని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. సోమవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వరదను తట్టుకొని నిలబడడంతో కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డ బరాజ్‌పై ఇన్నాళ్లు చేసినవన్నీ అబద్ధాలని తేలిపోయిందన్నారు.
వారు కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు మేడిగడ్డ బరాజ్‌పై అసత్య ప్రచారాలకు తెరలేపారన్నారు. సకాలంలో మరమ్మతులు చేపట్టక కాలయాపన చేసి రైతులకు సాగు నీరివ్వకుండా పంటలను ఎండబెట్టి రైతాంగం, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సాగు, తాగు నీరు కష్టాలు లేకుండా చేసేందుకే కేసీఆర్ దూర దృష్టితో ఆలోచన చేసిన అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే కాంగ్రెస్ నాయకులు చూసి ఓర్వలేక పోయారన్నారు. బరాజ్‌లోని 85 పిల్లర్లలో రెండు కుంగుబాటుకు గురైతే మొత్తం బరాజ్ వరదలతో కొట్టుకపోతుందని, లక్షల కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని, అబద్ధాలు, అభూత కల్పనలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. కళ్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలను రోడ్ల మీది తెచ్చి మూసీ నదికి ముందుకు తీసుకవస్తున్నారని, మూసీ నది అభివృద్ధికి సీఎం ఒకనాడు రూ.50వేల కోట్లని, మంత్రి జూపల్లి కృష్ణారావు రూ. 70వేల కోట్లని, మరోసారి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రూ. లక్షా యాభైవేల కోట్ల అంచనాలంటున్నారని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూసీపై మూడు సార్లు రేట్లను పెంచిన ఘనులు కాంగ్రెస్ పార్టీ నాయకులని అన్నారు.
కళ్లు ఉండి చూడలేని కబోదులు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. మేడిగడ్డతో ప్రజలు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పే రోజు వచ్చిందని, కాళేశ్వరంతో రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. దానికి సాక్ష్యమే మేడిగడ్డ బరాజ్ అని గుర్తు చేశారు. బరాజ్‌లో లక్షల క్యూసెక్కుల వరద నీరు వృథాగా పోతుందని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరిచి రైతులు, ప్రజల గురించి ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పునర్ వినియోగంలో తీసుకురావాలన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్పై ఉన్న కోపంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్ రావు, మహదేవపూర్ మాజీ సర్పంచ్ శ్రీపతిబాపు, సీనియర్ నాయకులు అన్కారీ ప్రకాశ్, పెండ్యాల మనోహర్, మాజీ వార్డు సభ్యుడు కడార్ల శంకర్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ఎండీ అలీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

