మరిపెల్లి దళితులు టీఆర్ఎస్ పార్టీకే మద్దతు
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

కమలాపూర్ : మండలంలోని మరిపెల్లి దళితులు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మరిపెల్లి దళితులతో ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమ కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు.
దళిత బంధు పథకం అమలుతో ప్రతిపక్షాలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ తప్పుడు ప్రచారానికి దిగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం వంగపల్లి గ్రామంలో గౌడకులస్తులతో సమావేశమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరిపెల్లికి చెందిన చందుపట్ల వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్యే పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్‌రావు, ఎంపీటీసీలు రామస్వామి, లింగారెడ్డి, కెడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, నాయకులు సరోత్తంరెడ్డి, పోడేటి సారయ్య తదితరులున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

