పకడ్బందీగా లాక్డౌన్

నిర్మానుష్యంగా గ్రామాలు
రహదారులపై పోలీసుల గస్తీ
నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా
పరకాల/నర్సంపేట/ఆత్మకూరు/దామెర/శాయంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి, మే 16 : జిల్లా వ్యా ప్తంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత గ్రామాలన్నీ నిర్మా నుష్యంగా మారుతున్నాయి. పోలీసులు రహదారుల పైకి వచ్చి కాపలా కాస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిం చిన వారికి జరిమానా విధిస్తున్నారు. ఆదివారం పరకా లలో 130 వాహనాలకు జరిమానా విధించినట్లు సీఐ పింగిళి మహేందర్ రెడ్డి తెలిపారు. బస్టాండ్ సెంటర్లో సీఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సూచించారు. లాక్డౌన్ సడలింపు సమయాల్లో బయటికి వచ్చే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. అలాగే, ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్ జంక్షన్ వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వస్తున్న వారికి సీఐ రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో కౌన్సె లింగ్ నిర్వహించి, జరిమానా విధిస్తున్నారు. నర్సం పేటలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
పది మందిపై కేసు నమోదు చేశారు. నర్సంపేట అయ్యప్ప ఆలయం వద్ద ఉన్న చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను పరిశీలిస్తున్నారు. అనుమతులు లేకుంటే నిలిపివేస్తు న్నారు. అలాగే, దామెర ఎస్సై భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓగ్లాపురం, ఊరుగొండ వద్ద వరంగల్-భూపాల పట్నం జాతీయ రహదారిపై వాహనదారులను తనిఖీ చేశారు. ట్రైనీ ఎస్సై, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొ న్నారు. శాయంపేట మండల పరిధిలో ఆదివారం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అకినపెల్లి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మండలంలోని మాందారిపేట హైవే, శాయంపేట సెంటర్‌తో పాటు అన్ని గ్రామాల్లో నిరంతర తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ప్రొబేషనరీ ఎస్సై లవన్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలంలోని నెక్కొండ- నర్సంపేట ప్రధాన రహదారిపై ఎస్సై శీలం రవి వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన 25 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై మహేందర్, కానిస్టేబుళ్లు తిరుపతి, రామకృష్ణ, ఉపేందర్, క్రాంతికుమార్ పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలోని గిర్నిబావి వద్ద చెక్‌పోస్ట్‌లో ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

