ఉనికిచర్లలో యునిసిటీ
ఉనికిచర్లలో ‘యునిసిటీ’ పేరుతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ వెంచర్ ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 135 ఎకరాల్లో లే ఔట్ రూపొందించిన కుడా అధికారులు ఈ నెల 20న ప్లాట్ల వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు.
- ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 135 ఎకరాల్లో లే ఔట్
- 100 ఫీట్ల ప్రధాన, 40 ఫీట్ల అంతర్గత రహదారుల నిర్మాణం
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కు సౌకర్యం.. ‘కుడా’ ఆధ్వర్యంలో ఇది మూడో వెంచర్
- ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుందని అంచనా
- ఈ నెల 20న ప్లాట్ల వేలం.. అందుబాటులో 200, 300 గజాల స్థలాలు
వరంగల్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉనికిచర్లలో ‘యునిసిటీ’ పేరుతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ వెంచర్ ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 135 ఎకరాల్లో లే ఔట్ రూపొందించిన కుడా అధికారులు ఈ నెల 20న ప్లాట్ల వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు. వెంచర్లో 100 ఫీట్ల ప్రధాన, 40 ఫీట్ల అంతర్గత రహదారుల నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పైన్లైన్, కరెంటు, పార్కు సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కుడా ఆధ్వర్యంలో ఇది మూడో వెంచర్ కాగా, అందుబాటులో 200, 300 గజాల ప్లాట్లు ఉన్నట్లు చెప్పారు. భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్య తరగతి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు.
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) మరో ప్రాజెక్టు చేపట్టింది. మూడో వెంచర్‌కు శ్రీకారం చుట్టిం ది. ఉనికచర్లలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో యునిసిటీ పేరట కొత్త వెంచర్‌ను చేస్తున్నది. 135 ఎ కరాల్లో అధికారులు ప్లాట్లు వేస్తున్నారు. ఈ నెల 20న ప్లాట్ల వేలం పక్రియను నిర్వహించనున్నారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ పమేలా సత్పతి ఇటీవల వరంగల్ పర్యటనకు వచ్చి దీనిపై పూర్తి స్థాయిలో చర్చించారు. కొత్త వెంచర్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. వెంచర్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 100 ఫీట్ల ప్రధాన రహదారులు, 40 ఫీట్ల అంతర్గత రహదారులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, పైన్లైన్, కరెంటు, పార్కు సౌకర్యాలు కల్పిస్తున్నారు. భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ యునిసిటీలో ప్లాట్ల ధరలు నిర్ణయించనున్నది.
లే ఔట్లతో 200, 300 గజాల ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించారు. తక్కువ ధరలో అన్ని మౌలిక వసతులు కలిగిన ప్లాట్లను ప్రజలకు అందించాలన్న సంకల్పంతో కుడా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చేసిన ప్రతి వెంచర్‌కు డిమాండ్ ఉంటున్నది. కుడా వెంచర్లలో ప్లాట్లు హాట్కేకుళ్లా అ మ్ముడు పోతున్నాయి. కుడా రియల్ వెంచర్లలో ఓసిటీతో తొలి అడుగు పడింది. ఇప్పటి వరకు 12 విడుతల్లో ఓసిటీలో ప్లాట్ల వేలం నిర్వహించారు. ప్రతి వేలంలో ప్లాట్ల కొనుగోలుకు పోటీ పెరిగింది. జూలైలో నిర్వహించిన 12వ విడుత వేలం పాటల్లో కమర్షియల్ స్థలం గజానికి లక్షా 11 వేలు, రెసిడెన్సీయల్ స్థలం గజానికి 83 వేలు ధర పలికింది. ఓసిటీలో ఇ ప్పటి వరకు 800 ప్లాట్లను విక్రయించారు. ఓసిటీ తర్వాత మడిపెల్లిలో మాసిటీ పేరుతో రెండో వెంచర్ ప్రారంభించారు. తొలివిడుత వేలం పాటలో 50 ప్లా ట్ల అమ్మకానికి వేలం పెట్టారు. వీటిలో 42 ప్లాట్లను విక్రయించారు. మాసిటీలో ప్లాట్ల వేలంకు స్పందన వచ్చింది. తాజాగా ఉనికిచర్లలో ఔటర్‌రింగ్ రోడ్డుకు సమీపంలో యునిసిటీ పేరిట మూడో వెంచర్‌ను మొ దలు పెట్టారు. ఈ నెల 20న నిర్వహించే తొలి విడుత వేలం పాటలో 50 ప్లాట్లను విక్రయానికి పెట్టనున్నారు.
నమ్మకంతో కుడా వెంచర్లపై ఆసక్తి
ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత కాలంలో ప్రభుత్వ సంస్థ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చేస్తున్న వెంచర్లపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కుడా అధికారులు ఓ సిటీ ప్లాట్ల వేలంలో రికార్డు ధర పలికింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లేని విధంగా ఓ సిటీలో గజం లక్షా పదకోండు వేల రూపాయలు పలికింది. కుడా ఆధ్వర్యంలోని వెంచర్లలో ప్లాట్లు కోనుగోలు చేసేందుకు అనేక మంది ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపుతున్నారు. కుడా వెంచర్లలో ప్లాటు కొనుగోలు చేస్తే అన్ని రకాలుగా భరోసా ఉంటుందని ఎక్కువ మంది కుడా వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

