‘కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ను విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి, డీపీవో జగదీశ్వర్ అన్నారు.
కమలాపూర్, జనవరి 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ను విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి, డీపీవో జగదీశ్వర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సీహెచ్‌సీ కంటి వెలుగు కోసం ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, ఐసీడీఎస్ సిబ్బంది, సెల్ఫ్ హెల్ప్‌లైన్ గ్రూపు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ గ్రామాల్లో అంధత్వంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తించి, ‘కంటి వెలుగు’లో చూపించుకునేలా కృషి చేయాలన్నారు. అన్ని శాఖ ల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి, కంటి వెలుగులో ప్రతి ఒక్కరూ పరీక్షలు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పల్లవి, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ గీతాలక్ష్మి, డాక్టర్ హర్షినిప్రియ, డాక్టర్ మౌనిక, సిబ్బంది దయామణి, రమేశ్, శోభ, విజయ, విప్లవ్‌కుమార్, వెంకటరమణారెడ్డి, కల్పన, సుధాకర్, కార్యదర్శులు సురేందర్, శృతి, శ్రీరాం, లావణ్య పాల్గొన్నారు.
భీమదేవరపల్లిలో..
భీమదేవరపల్లి: మండలంలోని ముల్కనూరు, వంగర గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు కేంద్రాలను మంగళవారం డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్, సీనియర్ వైద్యాధికారి ఉమశ్రీ పరిశీలించారు. ఈనెల 19 నుంచి ‘కంటి వెలుగు’ ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా ముల్కనూరు, వంగర గ్రామా ల్లో కంటి వెలుగు పరీక్షా కేంద్రాల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. సర్పంచ్‌లు ఎం కొమురయ్య, నల్లగోని రాజు, ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో నాగరాజు, పంచాయతీ సెక్రటరీ జంగం పూర్ణచందర్, మధుసూదన్, వైద్యాధికారులు శ్రీనివాస్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’కు అన్ని సౌకర్యాలు కల్పించాలి
శాయంపేట : ‘కంటి వెలుగు’ శిబిరాల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని మండల ప్రత్యేకాధికారి హరిప్రసాద్ సూచించారు. కంటి వెలుగును శాయంపేట, సూర్యనాయక్‌తండా గ్రామాల్లో ముందుగా ప్రారంభించనున్నా రు. ఈ మేరకు శాయంపేటలో జడ్పీ బాలికల పాఠశాల, తండాల్లో ఆయన సందర్శించారు. అనంతరం ఎంపీడీవో ఏ కృష్ణమూర్తి, ఎంపీవో రంజిత్, సర్పంచ్ రమేశ్‌తో కంటి వెలుగు పత్రాలను విడుదల చేశారు. ప్రతి రోజూ 300 మందికి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

