బీమా.. మత్స్యకారులకు ధీమా
- ఆపత్కాలంలో రూ.5 లక్షల ఇన్సూరెన్స్
- 18 నుంచి 55 ఏండ్లలోపు వారు అర్హులు
- 20వ తేదీ వరకు జాబితా నమోదు.. సభ్యత్వ రుసుము రూ.55
- జయశంకర్ జిల్లాలో 95 మత్స్య సహకార సంఘాలు.. 8,760 మంది సభ్యులు
- మత్స్యశాఖ ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికే బీమా వర్తింపు
జయశంకర్ భూపాలపల్లి, మే 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తుంది. ఇందులో భాగంగా రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. 2022-23 సంవత్సరానికి గాను మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోసం మత్స్యసహకార సంఘాల్లోని సభ్యుల జాబితా ఈ నెల 20 వరకు జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో సమర్పించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జయశంకర్ జిల్లాలో 95 మత్స్య సహకార సంఘాలు ఉండగా 8,760 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో 12 మహిళా సహకార సంఘాలుండగా 1,600 మంది సభ్యులున్నారు. కొత్తగా సహకార సంఘంలో సభ్యత్వం పొందాలనుకునే మత్స్యకారులు 18 నుంచి 55 ఏండ్లలోపు ఉండాలి. మత్స్యకారుడికి పూసల వల అల్లడం, ఈత కొట్టడం, తెప్ప వేసుకొని చేపలు పట్టడం వంటి అర్హతలు ఉంటేనే సభ్యత్వం కల్పించనున్నారు. సభ్యుడిగా చేరాలనుకునే వారు రూ. 55 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వాటాధనం రూ. 50, ప్రవేశ రుసుముగా రూ. 5 చెల్లించాలి.
ఈ నెల 20వరకు జాబితా..
2022-23 సంవత్సరానికి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోసం మత్స్య సహకార సంఘాలకు చెందిన అధ్యక్షులు సభ్యుల జాబితాను ఈ నెల 20వ తేదీ వరకు జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో సమర్పించి ఆన్లైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సభ్యుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే తప్ప ప్రమాద బీమా వర్తించదు. ఈ పథకంలో నమోదైన మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షలు వరకు చెల్లించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల శ్రేయ స్సు కోసం అమలు చేస్తున్న బీమా సదుపాయాన్ని మత్స్య కారులు సద్వినియో గం చేసుకోవాలి. సభ్యత్వ జాబితాలను సకాలంలో కార్యాలయంలో సమర్పించి, ఆన్లైన్ చేయటానికి సహకరించాలి. ఇందుకు ఆయా సంఘాల అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలి. ఆన్లైన్లో నమోదు చేసుకోకుంటే బీమా వర్తించదు. ప్రతి ఒక్కరూ తప్పక ఆన్లైన్ చేసుకోవాలి.
– ఆర్ అవినాశ్, జిల్లా మత్స్యశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

