ఔషధ నర్సరీలతో ఆరోగ్యం.. ఆదాయం

- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం
- మండల ప్రజలకు ఉచితంగా.. ఇతరులకు రూ.50కి విక్రయం
- గ్రామ పంచాయతీలకు సమకూరుతున్న అదనపు ఆదాయం
- ఆదర్శంగా నిలుస్తున్న నల్లబెల్లి మండలంలోని నర్సరీలు
- నల్లబెల్లిలో విరివిగా ఆయుర్వేద మొక్కల పెంపకం
‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికో నర్సరీ ఏర్పాటుచేసింది. ఇందులో పూలు, పండ్ల మొక్కలతో పాటు పలుచోట్ల ఔషధ మొక్కలనూ విరివిగా పెంచుతోంది. ఔషధ గుణాలున్న మొక్కలతో ఇటు ఆరోగ్యంతో
ఆయా గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఈ నర్సరీల్లో సర్వరోగ నివారిణి అయిన అశ్వగంధతో పాటు రణపాల, నల్ల ఉమ్మెత్త, బ్రసిలియోన్సిస్, గుంట గరగర, తెల్లగుల్జేరు వంటి అనేక మొక్కలు న్నాయి
నల్లబెల్లి, సెప్టెంబర్ 25
- గా చేపట్టిన హరితహారంలో భాగంగా అవసరమైన మొక్కలు పెంచేందుకు ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసింది. అధికారులు, పాలకుల ప్రత్యేక చొరవతో వాటిలో పూలు, పండ్ల మొక్కలతో పాటు ఔషధ గుణాలున్న మొక్కల పెంపకం జోరందుకుంది. నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట, నందిగామ, నారక్కపేట, బుచ్చిరెడ్డిపల్లె, కొండాపూర్ గ్రామాల్లో అశ్వగంధ, రణపాల, నల్ల ఉమ్మెత్త, బ్రసిలియోన్సిస్, గుంట గరగర, తెల్లగులిజేరు, తదితర రకాలను పెంచుతున్నారు. వీటిని మండల ప్రజలకు ఉచితంగా, ఇతరులకు ఒక్కో మొక్కను రూ.50 చొప్పున విక్రయిస్తూ జీపీలకు అదనపు ఆదాయం తెస్తున్నారు.
- పూలు, పండ్లతో పాటు ఆయుర్వేద మొక్కల పెంపకం
- అధికారులు, గ్రామ పంచాయతీ పాలకుల ప్రత్యేక చొరవ
- మొక్కకు రూ.50చొప్పున విక్రయం
- గ్రామ పంచాయతీలకు సమకూరుతున్న అదనపు ఆదాయం
అశ్వగంధ ఉపయోగాలు..
మొక్కను సర్వరోగ నివారిణి అంటారు. సొలనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం విథానియాసోమిలి ఫేరా. కొన్ని ప్రాంతాల్లో దీన్ని పెన్నే రు, బొమ్మడోలు అని పిలుస్తారు. దీనిని సంస్కృతంలో అశ్వగంధ అని పిలుస్తారు. తెలుగులో పెన్నేరు అని పిలుస్తారు. అశ్వగంధ మొక్క మానసిక ప్రశాంతతను చేకూర్చడంతో పాటు నిద్రలేమి తనాన్ని పోగొడు తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ఎముకల నొప్పులు, చర్మవ్యాధులు, ఫంగస్, క్షయ, గజ్జి, తామర, కంటి సంబంధిత వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది.
సంజీవనితో సమానం.. రణపాల
ఈ మొక్క పలు రోగాల నివారణకు సంజీవనిలా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా, అతివిరేచనాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, చికున్‌గున్యా, టైఫాయిడ్, లో బీపీ, గుండె సంబంధ వ్యాధులు, అజీర్తి, మలబద్దకం, వేడి, కొవ్వుగడ్డలు కరగదీయడానికి, కామెర్లు, చెవిపోటు, షుగర్‌తో పాటు పలురకాల జబ్బులు రణపాల మొక్క ఆకులు వాడితే తగ్గుతాయి. వీటి ఆకులను పప్పులో వేసుకుని ఆ హారంగా తీసుకోవచ్చు.
నల్ల ఉమ్మెత్త ఔషధ విలువలు..
నల్ల ఉమ్మెత్త మొక్క స్వల నేషి కుటుంబానికి చెందింది. ఈ మొక్క ఆకులను మెత్తగా రుబ్బి పైపూతగా లేదా ఆకులను కాల్చి పొగను పీల్చడం వల్ల కుష్ఠువ్యాధి, దురద, ఉబ్బసం, గడ్డలు హరించుకుపోతాయి.
అన్నిటికీ మేలు..
నర్సరీల్లో ఔషధ మొక్కల పెంపకంతో జీపీలకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా మండలం లోని నర్సరీల్లో ఈ మొక్కలు పెంచుతున్నాం. నాడు పల్లె ప్రగతి పను లను అవహేళన చేసిన వారే నేడు దాని ఫలితా లను చూసి అభి నందిస్తున్నా రు. ప్రజలకు ఔషధ మొక్కలను అందు బాటులోకి తేవడం గర్వంగా ఉంది.
కూచన ప్రకాశ్, ఎంపీవో, నల్లబెల్లి
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

