Jangaon : సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

బచ్చన్నపేట : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గుడి చెరువులో చేప పిల్లలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను సమగ్రాభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ముందుండి పాలన సాగిస్తున్నారని అన్నారు. సబ్బండ కుల, చేతి వృత్తుల బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. సంక్షేమం, ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్న విషయాన్ని స్వయంగా ప్రధాని మోది సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు చౌకబారు ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు.
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తెప్పించడంలో రాష్ట్ర బీజేపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవ చేశారు. ఏ ఎన్నిక జరిగినా విజయం టీఆర్ఎస్ పార్టీదే అన్నారు. గుడి చెరువు వద్ద భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ధ్వంసం చేసిన కట్టను తిరిగి పునర్నిర్మాణం చేయాలని, ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం మండల కేంద్రంలోని వైద్యాధికారి నవీన్‌కుమార్ తండ్రి మృతి చెందగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. అదే విధంగా కార్యకర్త పరుశరాములు మృతి చెందగా ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇరి రమణారెడ్డి, గిరబోయిన భాగ్యలక్ష్మిఅంజయ్య, మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీపతి, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతికృష్ణంరాజు, వైస్ ఎంపీపీ అనిల్‌రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు సతీశ్‌రెడ్డి, కనుకయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

