ఉద్యోగులందరూ టీకాలు తీసుకోవాలి

మహబూబాబాద్, డిసెంబరు 6 : ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్‌పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోస్ 94 శాతం పూర్తయిందన్నారు. రెండో డోస్ 52 శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. మొత్తంగా జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ వినియోగించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. మున్సిపాలిటీ, జీపీల్లో మాస్క్, శానిటైజర్ వినియోగంపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు.
గ్రీవెన్స్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ప్రతి సోమవారం గ్రీవెన్స్ ద్వారా ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో స్వయంగా వినతులు స్వీకరించిన కలెక్టర్ శశాంక ఫిర్యాదులను సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ దరఖాస్తులు, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్న వాటిపై శాఖల వారీగా సమీక్షిస్తూ పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు అభిలాషా అభినవ్, కొమురయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

