వెంకటాపూర్, జనవరి 24 : రామప్ప చెరువులోకి దేవాదుల పంపుహౌస్ నుంచి ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి పంట కోసం బీంఘన్పూర్ పంప్‌హౌస్ నుంచి ఒక మోటరు ద్వారా రామప్ప చెరువులోకి 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ రామప్ప నుంచి పాకాల, రంగాయచెరువు, గణప సముద్రం చెరువులకు నీటిని పంపిస్తున్నట్లు డీఈ రవీందర్ తెలిపారు. రామప్ప చెరువులో 30 అడుగుల నీటి సామర్థ్యం ఉండేలా సుమారు 60 రోజుల పాటు నీటిని పంపింగ్ చేయనున్నట్లు చెప్పారు.