కేజీబీవీలు అప్‌గ్రేడ్
మారుమూల తండాలు, గ్రామాల్లోని నిరుపేద బాలికలకు సకల సౌకర్యాలతో కార్పొరేట్‌కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. ఒక్కో విద్యార్థినిపై ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తూ 6 నుంచి 10వ తరగతి వరకు విద్యనందిస్తున్నది. ఈ క్రమంలో ఇంటర్ వరకు అవకాశం కల్పించేందుకు అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
- కళాశాల స్థాయికి పెంచుతూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు
- పదో తరగతి నుంచి ఇంటర్ విద్యకు అవకాశం
- ఉమ్మడి జిల్లాలో 7 విద్యాలయాల ఉన్నతి
- డ్రాపౌట్స్‌ను తగ్గించి.. బాల్య వివాహాలను అరికట్టడమే లక్ష్యం
- ఒక్కో విద్యార్థినిపై ఏడాదికి రూ.1.25 లక్షల ఖర్చు
నెల్లికుదురు, ఆగస్టు 24 : మారుమూల తండాలు, గ్రామాల్లోని నిరుపేద బాలికలకు సకల సౌకర్యాలతో కార్పొరేట్‌కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. ఒక్కో విద్యార్థినిపై ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తూ 6 నుంచి 10వ తరగతి వరకు విద్యనందిస్తున్నది. ఈ క్రమంలో ఇంటర్ వరకు అవకాశం కల్పించేందుకు అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 37 కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేయగా అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7 కేజీబీవీలు కళాశాలలుగా మారుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. నేటి బాలలే నవభారత నిర్మాతలని భావించిన తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థకు భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ పెద్దపీట వేస్తున్నది.
మారుమూల తండాలు, గ్రామాల విద్యార్థినులకు కార్పొరేట్‌కు దీటుగా విద్యనందిస్తూ సకల సౌకర్యాలను కల్పించాలనే లక్ష్యంతో కేజీబీవీలను ఏర్పాటుచేసింది. పదో తరగతి పూర్తైన విద్యార్థినిని తమ తల్లిదండ్రులు కళాశాల స్థాయి చదువుల కోసం పట్టణ ప్రాంతాలకు పంపించలేక మధ్యలో చదువులు ఆపేయడం, పెళ్లిళ్లు చేయడం జరుగుతున్నది. డ్రాపౌట్స్‌ను తగ్గించి, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం కేబీజీవీలను పదో తరగతి నుంచి ఇంటర్ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తున్నది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడు కేజీబీవీలను కళాశాల స్థాయికి మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేజీబీవీల్లో సౌకర్యాలివీ..
6వ తరగతిలో అడ్మిషన్ పొందిన విద్యార్థినులకు 12వ తరగతి పూర్తయ్యేంత వరకు కార్పొరేట్‌ను తలదన్నే నాణ్యమైన విద్య అందుతుంది. ప్రతిరోజు మెనూ ప్రకారం పౌష్టికాహారం. ప్రతీరోజు గుడ్డు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రివేళల్లో భోజనం, సాయంత్రం స్నాక్స్, వారానికి 3 సార్లు నాన్‌వెజ్‌తో భోజనం అందిస్తారు. 3 నెలలకు సరిపడా విద్యార్థినిలకు అవసరమయ్యో హెల్త్ కిట్స్‌లను విద్యా సంవత్సరంలో మూడు సార్లు అందిస్తారు.
ఉమ్మడి జిల్లాలో 7 కేజీబీవీలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడు కేజీబీవీలు ఉన్నతీకరించారు. వాటిలో హనుమకొండ జిల్లా వేలేరు, ఎల్కతుర్తి, జనగామ జిల్లాలో బచ్చన్నపేట, మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం, ములుగు జిల్లాలో ఏటూరునాగారం, వరంగల్ జిల్లా ఖానాపురం, సంగెం కలిసి మొత్తం 7 కేజీబీవీలు కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్ కాగా ప్రభుత్వం ఆ విద్యాలయాలకు అనుమతులు జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో దంతాలపల్లి మినహా 15 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. అందులో మొదటి దఫా మహబూబాబాద్, గూడూరు, డోర్నకల్ కేజీబీవీలు ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ అయ్యాయి. రెండవ దఫాలో బయ్యారం, గార్ల, మూడవ దఫా గంగారం అప్‌గ్రేడ్ కాగా తాజాగా కేసముద్రం కేజీబీవీకి అవకాశం దక్కింది.
డ్రాపౌట్స్ తగ్గించడమే లక్ష్యంగా..
మారుమూల తండాలు, గ్రామీణ ప్రాంత నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం పట్టణాలకు పంపలేక ఇబ్బంది పడుతుంటారు. కొందరు పిల్లలను కూలీ పనులకు తీసుకెళ్లడం, పెళ్లిలు చేయడం వల్ల ఎక్కువమంది బడి మానేస్తుంటారు. ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య పెరగడంతో పాటు బాల్య వివాహాలూ ఎక్కువవుతున్నాయి. వీటిని నివారించేందుకు కార్పొరేట్ స్థాయికి దీటుగా సౌకర్యాలను కల్పించి ప్రాథమికోన్నత స్థాయి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థినులకు విద్య, భోజనం తదితర సౌకర్యాలను కల్పిస్తోంది.10వ తరగతి పూరైన విద్యార్థినిలు కళాశాల చదువుల కోసం ప్రతీరోజు బస్సుల్లో పట్టణాలకు వెళ్లి ఇబ్బంది పడొద్దని ప్రభుత్వం కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేసింది. దీంతో కేజీబీవీలో 6వ తరగతిలో అడ్మిషన్ పొందిన విద్యార్థిని అదే విద్యాలయంలో ఇంటర్ వరకు పూర్తి చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థినుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

