దమ్ముంటే బొగ్గు గనులన్నీ సింగరేణికే కేటాయించాలి
కిషన్రెడ్డీ.. నీకు దమ్ముందా? ఉంటే బొగ్గుగనులన్నింటినీ సింగరేణికే కేటాయించి భరోసా యాత్ర చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మాట్లాడారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ యాత్ర చేస్తున్నావు? అది కాంగ్రెస్‌కు బతుకునిచ్చే యాత్ర అని మండిపడ్డారు.
- కిషన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గండ్ర సవాల్
- ఎవరి కోసం భరోసా యాత్ర చేస్తున్నావ్?
- అది కాంగ్రెస్‌కు బతుకునిచ్చే యాత్ర
జయశంకర్ భూపాలపల్లి, జూలై 15 (నమస్తే తెలంగాణ) : కిషన్రెడ్డీ.. నీకు దమ్ముందా? ఉంటే బొగ్గుగనులన్నింటినీ సింగరేణికే కేటాయించి భరోసా యాత్ర చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మాట్లాడారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ యాత్ర చేస్తున్నావు? అది కాంగ్రెస్‌కు బతుకునిచ్చే యాత్ర అని మండిపడ్డారు. ఏడేండ్లుగా కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు ఏంలాభం చేశావో చెప్పాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అంధకారంలోకి నెట్టే కుట్ర చేయగా, గతంలో తమ పార్టీ ఆధ్వర్యంలో బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలని అనేక ధర్నాలు, రాస్తారోకోలు చేశామన్నారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి 100 శాతం అన్‌ఫిట్ చేయించి, పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్లందరికీ ఉద్యోగాలిస్తే భరోసా ఇచ్చినట్లేనన్నారు. సింగరేణిని కేసీఆర్ దోచుకుతిన్నారనడం సిగ్గుచేటని, ఆయన కార్మికులకు 32 శాతం లాభాల వాటా ఇచ్చాడని, రామప్పకాలనీలో 2వేల క్వార్టర్స్ నిర్మించారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలని విమర్శించారు.
సింగరేణికి ప్రభుత్వం బాకీపడ్డ రూ. 54వేల కోట్లను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కన్నెపల్లి పంపులు ఆన్‌చేసి ప్రాజెక్ట్‌కు ఏమైనా జరిగితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ రాజకీయాలు చెయ్యమని సవాల్ విసిరితే.. కాంగ్రెసోళ్లు దాన్ని స్వీకరించలేదన్నారు. ఇప్పటికైనా కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటర్లను ఆన్‌చేసి నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, కౌన్సిలర్లు నరేందర్, మంజుల, పూర్ణచందర్, రాజు, నాయకులు మాడ హరీశ్‌రెడ్డి, నూనె రాజుపటేల్, మురళీధర్, దుండ్ర కుమార్, దేవేందర్, తిరుపతి, ఎం వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు దేవరకొండ మధు, కుమారస్వామి, యూత్ నాయకులు మహేందర్, దిలీప్‌కుమార్, రాకేశ్, తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
హోదాను పునరుద్ధరించాలి..
సత్తుపల్లి-3, కోయగూడెం-3 బ్లాక్‌లను నామినేషన్ పద్ధతిలో, శ్రావణపల్లి కేకే-6 మైన్‌ను నేరుగా సింగరేణికే కేటాయించాలి. సింగరేణి పబ్లిక్ సెక్టార్ హో దాను పునరుద్ధరించాలి. గోలేటి, మాదా రం, పూసాలపల్లి జేకే-5వ గనులకు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు మంజూరు చేయించాలి. మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్‌ను నేరుగా సింగరేణికే కేటాయించాలి. ఇవన్నీ నెరవేరిస్తేనే కార్మికులకు అసలైన భరోసా ఇచ్చినట్లు అవుతుంది.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

