వరంగల్ : వరంగల్ జిల్లా స్టే్షన్ఘనపూర్ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) బీఆర్ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు రాజీనామా లేఖను పంపించారు. బీఆర్ఎస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి చేస్తున్న రాజీనామాను ఆమోదించాలని కోరారు. త్వరలో ఆయన కాంగ్రెస్లో (Congress) చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు.