ఖాకీ రూప కామాంధుడు
తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడని ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బండారి సంపత్‌పై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేయూ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంజీవ్ తెలిపిన వివరాల ప్రకా రం..
- తల్లితో వివాహేతర సంబంధం.. బిడ్డపై లైంగికదాడికి యత్నం
- పోక్సో కేసులో సీఐ బీ సంపత్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
సుబేదారి, మార్చి 22 : తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడని ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బండారి సంపత్‌పై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేయూ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంజీవ్ తెలిపిన వివరాల ప్రకా రం.. 2017లో సంపత్ వర్ధన్నపేట ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో కేయూ స్టేషన్ పరిధిలోని విజయగణపతి కాలనీకి చెందిన బాలిక తల్లితో పరిచయం ఏర్పడింది. సంపత్ కేయూసీ ఎస్ఐగా బదిలీ కావడంతో వీరిద్దరి మధ్య మరింత చనువు పెరిగింది. వివాహిత భర్త గమనించి 2022 డిసెంబర్లో అప్పటి పోలీస్ కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేయడంతో సంపత్‌పై బదిలీ (వీఆర్) వేటు పడింది. అయినా సంపత్ ఆమెతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాడు.
దీంతో మహిళ భర్త అమె నుంచి దూరం కాగా, అదే ఫిబ్రవరిలో సంపత్‌కు, మహిళ మధ్య గొడవలు జరిగాయి. కొద్ది రోజుల క్రితం ఇంటర్ చదువుతున్న తన కూతురుతో సంపత్ అసభ్యకరంగా ప్రవర్తించాడని, లైంగికదాడికి ప్రయత్నించాడని సదరు మహిళ గురువారం కేయూసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, సంపత్‌ను వరంగల్‌లోని ఆయన నివాసంలో గురువారం రాత్రి అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రాథమిక విచారణ చేపట్టారు. తర్వాత ఎంజీఎం వైద్యశాలలో మెడికల్ పరీక్షలు చేయించి, రిమాండ్‌కు తరలించారు. కాగా సంపత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్గా ఉద్యోగోన్నతి పొంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సైబర్ క్రైమ్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. 2012లో ఎస్ఐగా నియామకమైన అతడు, కుటుంబంతో వరంగల్‌లో నివాసముంటున్నాడు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

