నాలుగో రోజుకు విద్యుత్ కార్మికుల సమ్మె
తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.
- పలుచోట్ల ఆర్టిజన్ల ముందస్తు అరెస్ట్
హనుమకొండ, ఏప్రిల్ 11 : తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఆయా విద్యుత్ కార్యాలయాల ఎదుట ఏర్పాటు చేసిన శిబిరాల్లో కూర్చొని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.
ఆయా శిబిరాలను పలు యూనియన్లు, సంఘాల నాయకులు సందర్శించి మద్దతు తెలిపాపరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) ప్రధాన ద్వారం వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆర్టిజన్ల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. డిప్యూటీ సీఎం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, పాల్వంచ కేటీపీఎస్ ముట్టడికి వెళ్లకుండా పలువురు కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

