‘ఈజ్ ఆఫ్ లివింగ్’పై అవగాహన కల్పించాలి
ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వేపై నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వే పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ కేంద్ర గృహ, పట్టణా భివృద్ధి మంత్రిత్వ శాఖ నగర ప్రజల జీవన స్థితిగతులపై ఆన్లైన్లో నిర్వహిస్తున్న సర్వేలో నగరవాసులు భాగస్వా మ్యం అయ్యేలా చూడాలన్నారు
- గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య
- కార్పొరేషన్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ
వరంగల్, జనవరి 2 : ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వేపై నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వే పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ కేంద్ర గృహ, పట్టణా భివృద్ధి మంత్రిత్వ శాఖ నగర ప్రజల జీవన స్థితిగతులపై ఆన్లైన్లో నిర్వహిస్తున్న సర్వేలో నగరవాసులు భాగస్వా మ్యం అయ్యేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహి స్తున్న సర్వేపై ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో అదన పు కమిషనర్ రవీందర్ యాదవ్, ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్‌చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, కార్యదర్శి విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ అనీసుర్ రషీద్, బయాలజిస్ట్ మాధవరెడ్డి, సీహెచ్‌వో శ్రీనివాసరావు, డీఎఫ్‌వో శంకరలింగం పాల్గొన్నారు.
బల్దియా గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
కాలనీలలో కనీస వసతులు కల్పించాలని బల్దియా గ్రీవెన్స్‌లో బాధితులు కమిషనర్ ప్రావీణ్యను కోరారు. సోమవారం బల్దియా కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో బాధితుల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. 56వ డివిజన్ పరిధి సురేంద్రపురి ఫేజ్ 2 కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఇనుగాల శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో వినతి పత్రం అందజేశారు. ఎన్జీవోస్కాలనీ రోడ్డులోని ఇందిరానగర్‌లో 16 నెలల నుంచి తాగునీటి సరఫరా కావడం లేదని కాలనీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి విన్నవించారు.
కరీమాబాద్‌లోని హిందూ అరె కటిక స్మశాన వాటికలో అసం పూర్తిగా ఉన్న కర్మకాండ గదులు, స్నాన గదుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని స్మశాన వాటిక కన్వీనర్ గోగికార్ రవిందర్ గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందచేశారు. ఈ గ్రీవెన్స్‌లో అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్,ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్ చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, కార్యదర్శి విజయలక్ష్మి, సీహెచ్‌వో శ్రీనివాసరావు, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, బయాలాజిస్ట్ మాధవరెడ్డి, డీఎఫ్‌వో శంకర్లింగం, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రషీద్, జోనా, అన్ని విభాగాల వింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

