మెగా పార్కులో వజ్రోత్సవ వనమహోత్సవం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం వ రంగల్ జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయ న తొలిసారి జిల్లాకు వచ్చారు.
- పొగడ మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం
- పార్కులో వస్త్ర పరిశ్రమల స్థాపన, మౌలిక వసతులపై ఆరా
- వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పరిశీలన
- నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి అసంతృప్తి
వరంగల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం వ రంగల్ జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయ న తొలిసారి జిల్లాకు వచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా హె లికాప్టర్ ద్వారా గీసుగొండ మం డలంలోని శాయంపేట వద్ద గల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కు చేరుకున్నారు. టెక్స్టైల్ పా ర్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి కా కతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పొగడ మొక్క నాటడం ద్వారా ఈ ఏడాది రాష్ట్రస్థాయి వజ్రోత్సవ వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చదనం పెంపు లక్ష్యంగా ఈ ఏడాది రాష్ట్రంలో 20.20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పీసీసీఎఫ్ డోబ్రియల్ వెల్లడించారు.
అనంతరం కిటెక్స్ కంపెనీ వద్ద పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులకు స్థలాల కేటాయింపు విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి బాధిత రైతులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పా రు. అనంతరం ఆయన 24 అంతస్తులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్ప త్రి నిర్మాణ పనుల పురోగతిపై గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన మ్యాప్ ద్వారా పనుల వివరాలను తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిగినవి, ఇంకా మిగిలి ఉన్న పనుల వివరాలను ఆర్అండ్బీ, వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో ఆస్పత్రి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

