సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూలిన సీలింగ్
పైన పటారం.. లోన లోటారం అన్నట్లుంది సూప ర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం. కేంద్ర ప్రభుత్వం నాసిరకంగా నిర్మాణ పనులు చేపట్టడం రోగులకు దడ పుట్టిస్తున్నది. ఎప్పుడు ఎక్కడ ఏ భాగం కూలి మీదపడుతుందోనని రోగులు, అటెండెంట్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం హాస్పిటల్ ఐదో అంతస్తులోని చిన్న పిల్లల వార్డు ముందు సీలింగ్ కుప్పకూలింది
- పిల్లల వార్డు ముందు కూలడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన
- నాసిరకం పనులే కారణమని అధికారుల గుర్తింపు
- నిర్మాణ సమయంలో నాణ్యతను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
వరంగల్ చౌరస్తా, జనవరి 20 : పైన పటారం.. లోన లోటారం అన్నట్లుంది సూప ర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం. కేంద్ర ప్రభుత్వం నాసిరకంగా నిర్మాణ పనులు చేపట్టడం రోగులకు దడ పుట్టిస్తున్నది. ఎప్పుడు ఎక్కడ ఏ భాగం కూలి మీదపడుతుందోనని రోగులు, అటెండెంట్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం హాస్పిటల్ ఐదో అంతస్తులోని చిన్న పిల్లల వార్డు ముందు సీలింగ్ కుప్పకూలింది. దాంతో రోగులు, అటెండెంట్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కేంద్రం ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి పనులపై కనీస పర్యవేక్షణ చేపట్టకపోవడంతో నిర్మాణ లోపాలు చాలానే కనిపిస్తున్నాయి.
చిన్న పిల్లల వార్డుకు ముందు సీలింగ్ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏసీ బిగింపు సరిగా చేపట్టకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ దివ్వెల మోహన్‌దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ రాంకుమార్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎస్ఈ దేవేంద్రకుమార్ చేరుకొని ఘటనపై ఆరాతీశారు. పనుల్లో నాణ్యతా లోపాలే ప్రమాదానికి కారణమని గుర్తించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో రేడియాలజీ విభాగంలో సీలింగ్ కూలిన ఘటన మరువక ముందే ఇది జరుగడంతో దవాఖానలో ఎప్పుడు ఏం కూలుతుందోనని భయంగా ఉందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎలాంటి ప్రాణం నష్టం కలుగకముందే నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

