Inavolu | గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి : బొల్ల చక్రపాణి
గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొట్ల చక్రపాణి, జిల్లా ఆధ్యక్షుడు గబ్బెట యాకయ్యలు డిమాండ్ చేశారు.
ఐనవోలు( హనుమకొండ): గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొట్ల చక్రపాణి, జిల్లా ఆధ్యక్షుడు గబ్బెట యాకయ్యలు డిమాండ్ చేశారు. ఐనవోలు మండల కేంద్రంలోని ఆంగడి సెంటల్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభ వాల్ పోస్టర్ వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీపీ కార్మికులకు మల్టీపర్సస్ విధానాన్ని రద్దు చేసి, పాత కేటగిరీలకు కొనసాగించాలన్నారు. ప్రతినెల ఐదవ తేది లోపు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని కారోబార్లకు బిల్ కలెక్టర్లుగా స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24, 25వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరిగే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఐదవ మహాసభకు జీపీ కార్మికుల పెద్ద సంఖ్యలో హజరై జయపద్రం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు గాడె కుమారస్వామి, బొక్కల సురేందర్, నాయకులు ఎండీ షబ్బీర్, కొత్తూరు ఏసోబు, ఎం శ్రీనివాస్, బీ చంద్రయ్య, కే రవి, ఎలిషమ్మ, లచ్చమ్మ, పూల, రజిత, కొమురయ్య తదతరులు పాల్గొన్నారు
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

