AI | కృత్రిమ మేధ బోధనను సద్వినియోగం చేసుకోవాలి : మండల విద్యాధికారి
AI | కృత్రిమ మేధ (AI) బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి మారెపల్లి సునితా రాణి తెలిపారు.
AI | భీమదేవరపల్లి, మార్చి 15: కృత్రిమ మేధ (AI) బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి మారెపల్లి సునితా రాణి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధా గదిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అభ్యాసన సామర్ధ్యాలు పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు స్వయంగా భాషా సామర్ధ్యాలు సాధన చేసి ఆంగ్లభాషపై అలవోకగా పట్టు సాధిస్తారని పేర్కొన్నారు. తెలుగు భాష ద్వారా ఆంగ్లం నేర్చుకోవడంలో కృత్రిమ మేధ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ బోధనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పోలవేని రవి ప్రకాష్, పాఠశాల హెచ్ఎం మార్కండేయ, ఉపాధ్యాయులు కొమురయ్య, రాజ్య ప్రభ, శ్రీదేవి, రాధిక, రాజునాయక్, సీఆర్పీ హిమాసాగర్, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

