సీఎంఆర్ రికవరీ పేరిట అక్రమ దందా
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రికవరీ ములుగు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు, రైస్ మిల్లర్లు మరో అక్రమానికి తెరలేపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల జరిగిన పరిణామాలను ఇతర మిల్లుల యజమానులు చూపిస్తున్నారు.
- సన్న వడ్లు ఇచ్చి.. దొడ్డు బియ్యం తీసుకునే ఎత్తుగడ
- రైస్ మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారుల కుమ్మక్కు
- సీజ్ చేసిన ఆర్ఎన్ఆర్ ధాన్యం ఇతర మిల్లులకు కేటాయింపు
- రూ. 6 కోట్ల విలువైన 27 వేల బస్తాలు తరలించే యత్నం
- రెండు రోజులుగా కొనసాగుతున్న తతంగం
- హైకోర్టును ఆశ్రయించిన బాధిత రైస్ మిల్లు యజమాని
- ధర్మాసనం స్టే ఉత్తర్వులతో నిలిచిపోయిన రికవరీ
- ఉన్నది ఉన్నట్లుగా తిరిగి సీజ్ చేసిన అధికారులు
ములుగు, జూలై 23(నమస్తే తెలంగాణ) : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రికవరీ ములుగు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు, రైస్ మిల్లర్లు మరో అక్రమానికి తెరలేపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల జరిగిన పరిణామాలను ఇతర మిల్లుల యజమానులు చూపిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం రెండు రోజులుగా కొనసాగుతుండగా, తాజాగా హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌తో నిలిపివేశారు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా కేంద్రంలోని సాయి సహస్ర మిల్లు యజమాని 2020లో రూ.12 కోట్ల విలువైన సీఎంఆర్ రైస్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి బకాయి డబ్బులు వసూలు చేసే క్రమంలో సివిల్ సైప్లె అధికారులు ఈ ఏడాది మే 3న సదరు మిల్లుపై దాడి చేసి రూ. 6 కోట్ల విలువైన 27 వేల బస్తాల ధాన్యాన్ని (రైస్ మిల్లు యజమాని గత రెండు సీజన్లలో రైతుల నుంచి ప్రైవేట్‌గా ఆర్ఎన్ఆర్ సన్న వడ్లను కొనుగోలు చేసి నిల్వ ఉంచారు) అధికారులు సీజ్ చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ధాన్యంతో పాటు బియ్యం కూడా ఆ మిల్లులోనే ఉన్నాయి.
అయితే సీఎంఆర్ చెల్లింపు విషయమై మిల్లు యజమాని కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే అధికారులు సీఎంఆర్ రికవరీ పేరిట సీజ్ చేసిన ధాన్యాన్ని ఇతర మిల్లులకు కేటాయిస్తున్నారు. సీజ్ చేసిన సన్న వడ్లపై కన్నేసిన కొందరు రైస్ మిల్లర్లు, యూనియన్ నాయకులు అధికారులతో కుమ్మక్కై తమకే సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆర్ఎన్ఆర్ వడ్లను బియ్యంగా మార్చి క్వింటాకు రూ. 5 నుంచి రూ. 6 వేల వరకు విక్రయించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోవచ్చని, బయట మార్కెట్లో దొడ్డు బియ్యాన్ని తక్కువ ధరకు (రూ. 2 నుంచి రూ. 3 వేలు) కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించవచ్చని పథకం రచించారు. చేసుకున్న ఒప్పందం మేరకు అధికారుల కనుసన్నల్లో ధాన్యాన్ని రెండు రోజులుగా ఆయా మిల్లులకు తరలిస్తున్నారు. అలాగే వడ్ల బస్తాలను లారీల్లోకి ఎక్కించి యూనియన్ నాయకుడికి చెందిన వే బ్రిడ్జిలోనే కాంటా పెడుతూ తూకంలో సైతం అవకతవకలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఇతర రైస్ మిల్లుల యజమానులు సైతం ధ్రువీకరిస్తున్నారు. వారి దందాకు ధాన్యం తరలింపే సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్‌గా మారింది.
హైకోర్టు స్టేతో ఆగిన రికవరీ
రైస్ మిల్లర్లు, అధికారులు కలిసి మిల్లులోని ధాన్యాన్ని తరలించుకుపోతున్నారనే విషయమై సాయి సహస్ర మిల్లు యజమాని మంగళవారం హైకోర్టులో కేసు వేయగా ధర్మాసనం స్టే మంజూరు చేసింది. దీంతో రెండు రోజులుగా కొనసాగిన ధాన్యం రవాణా అప్పటికప్పుడు ఆగిపోయింది. సివిల్ సైప్లె డీఎం రాంపతి, తహసీల్దార్ విజయ్‌భాస్కర్ హుటాహుటిన రైస్ మిల్లు వద్దకు వచ్చి ధాన్యాన్ని తరలిస్తున్న లారీలను, రైస్ మిల్లు నుంచి తరలించగా మిగిలి ఉన్న స్టాక్‌ను వీడియో రికార్డు చేసి తిరిగి మిల్లును సీజ్ చేశారు.
అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ మిల్లు యజమాని నుంచి సీఎంఆర్‌ను రికవరీ చేసేందుకు ధాన్యాన్ని తరలించామని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా సీజ్ చేసినట్లు తెలిపారు. కాగా, రైస్ మిల్లు యజమాని ధ్రువీకరణ లేకుండా రెండు రోజులుగా రైస్ మిల్లర్లు, లారీ యజమానులు సివిల్ సప్లయ్ అధికారులతో కుమ్మక్కై ఇష్టారీతిన ధాన్యాన్ని తరలించారని మిల్లు సూపర్వైజర్ తెలిపారు. స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత మిల్లులో ఉన్న లారీలను ఫొటోలు తీస్తుండగా అక్కడే ఉన్న ఎస్సై బలవంతంగా ఫోన్‌ను లాక్కొని ఫొటోలు డిలీట్ చేసినట్లు ఆరోపించాడు. కాగా, సీజ్ చేసిన రైస్ మిల్లులో ఉన్న సన్న వడ్లను ఇతర మిల్లులకు తరలించే విషయంలో భారీ అవకతవకలు జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వడ్లు ఇచ్చి.. బియ్యం తీసుకుంటాం
కాగా, ఈ విషయమై సివిల్ సైప్లె డీఎం రాంపతిని వివరణ కోరగా సీజ్ చేసిన మిల్లులోని ధాన్యాన్ని తరలించే క్రమంలో వడ్లను ఇతర రైస్ మిల్లర్లకు కేటాయించి వారి నుంచి బియ్యం తీసుకోనున్నట్లు చెప్పారు. ధాన్యం వివరాలు నమోదు చేసుకుంటున్నామని,రైస్ మిల్లర్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు ఇచ్చి న ధాన్యానికి అనుగుణంగా బియ్యం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అయితే ధాన్యం తరలింపులో జరుగుతున్న అవకతవకలపై కలెక్టర్ ఆరా తీసి నిజానిజాలను తేల్చడంతో పాటు బాధ్యులైన అ ధికారులు, రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
– రాంపతి, సివిల్ సైప్లె డీఎం
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

