రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి
రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తే లాభసాటిగా ఉంటుందని జిల్లా వ్యావసాయ అధికారి ఉషాదయాళ్ సూచించారు. రెడ్లవాడలో కుప్పల బాలరాజు వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం యంత్రాలతో వరినాట్లు వేసే విధానంపై రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.
- యంత్రాల వినియోగంతో ఖర్చు ఆదా
- కూలీల కొరతను అధిగమించే అవకాశం
- జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్
నెక్కొండ, జూలై 19: రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తే లాభసాటిగా ఉంటుందని జిల్లా వ్యావసాయ అధికారి ఉషాదయాళ్ సూచించారు. రెడ్లవాడలో కుప్పల బాలరాజు వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం యంత్రాలతో వరినాట్లు వేసే విధానంపై రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడుతూ యంత్రాలతో నాట్లు వేస్తే ఎకరాకి కేవలం రూ. 5 వేల ఖర్చు మాత్రమే అవుతుందని, నారుమడి, నారు మోసే ఖర్చులు తగ్గుతాయని, ఎకరానికి 12 కిలోల విత్తనం మాత్రమే సరిపోతుందని వివరించారు. యాంత్రీకరణ పద్ధతిలో నాటు వేయడం వల్ల సాళ్లలోకి గాలి, వెలుతురు విశాలంగా ప్రవేశించి చీడపీడల ఉధృతి తగ్గుతుందని, తద్వారా దిగుబడి పెరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో ఏవో నాగరాజు, ఏఈవో లోచన్, రైతులు మాలోత్ శివలాల్, మూడు శ్రీను, బండి రాజు, సభావత్ రంజిత్, లింగయ్య, గట్టయ్య పాల్గొన్నారు.
అధికారుల సూచనలు పాటించాలి
నర్సంపేటరూరల్: రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను విధిగా పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ అన్నారు. మండలంలోని రాజుపేట, ముత్తోజిపేటలో ఆమె వరి, ప త్తి, మక్కజొన్న పంటలను పరిశీలించారు. వరి, పత్తి, వేరుశనగ, మక్కజొన్న పంటల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పా టించాలన్నారు. వరి సాగు చేసే ముందు పచ్చిరొట్టను సాగు చేసి భూమిలో కలియదున్నాలని సూచించారు. వరిలో వచ్చే వివిధ తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. ఆమె వెంట ఏవో కృష్ణకుమార్, ఏఈవోలు మెండు అశోక్, మండల భరత్, నవీన్ ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

