కలిసికట్టుగా పనిచేయండి
అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ గెలిపించాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎల్వైఆర్ గార్డెన్ ఆవరణలో ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల ముఖ్య కార్యకర్తలు, నాయకులతో ఆయన గ్రామాల వారీగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
- బీఆర్ఎస్ను గెలిపించండి
- తొర్రూరును అభివృద్ధి చేసింది మనమే..
- కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుంటా..
- మనం చేసిన మంచి వివరించి ఓట్లు అడగండి..
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- వివిధ గ్రామాల ముఖ్యనేతలతో ఆత్మీయ సమ్మేళనం
అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ గెలిపించాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎల్వైఆర్ గార్డెన్ ఆవరణలో ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల ముఖ్య కార్యకర్తలు, నాయకులతో ఆయన గ్రామాల వారీగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మనం చేసిన అభివృద్ధే కనిపిస్తున్నదని, చేసిన మంచిని ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలన్నారు. ఇప్పటిదాకా గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించానని, ఇక కార్యకర్తల బాగోగులు చూస్తామని హామీ ఇచ్చారు. మన మధ్య బేధాభిప్రాయాలు ఉంటే పకన పెట్టి, కలిసికట్టుగా పని చేద్దామని మంత్రి కార్యకర్తలకు ఉద్బోధించారు.
– తొర్రూరు, అక్టోబర్ 29
తొర్రూరు, అక్టోబర్ 29 : ‘నిరంతరం మీతోనే కలిసి ఉంటున్నా.. మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ మీ వెంటే ఉంటున్నా.. మీరంతా కలిసికట్టుగా నా గెలుపు కోసం ఈ నెల రోజులు కష్టపడండి.. వచ్చే ఐదేళ్లు మీ అభివృద్ధి కోసం పని చేస్తా’నని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తొర్రూరు డివిజన్ కేం ద్రంలోని ఎల్వైఆర్ గార్డెన్ ఆవరణలో ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల ముఖ్య కార్యకర్తలు, నా యకులతో ఆయన గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేసింది మనమే.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఇవ్వాల పల్లెల్లో అన్ని వసతులు ఉన్నాయి.. అభివృద్ధి, సం క్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి.. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకొచ్చామన్నారు. తొర్రూరును డివిజన్ కేంద్రం చేశాం.., మున్సిపాలిటీని చేశాం.., రూ.150 కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇప్పటిదాకా గ్రా మాల అభివృద్ధిపై దృష్టి సారించానని, ఇక కార్యకర్తల బాగోగులు చూస్తామని హామీ ఇచ్చారు. మన మధ్య ఏమైనా బేధాభిప్రాయాలు ఉంటే పకన పెట్టి, కలిసికట్టుగా పని చేద్దామని మంత్రి కార్యకర్తలకు ఉద్బోధించారు. గ్రామాల వారీగా జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రభు త్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలాల ఇన్చార్జిలు, బీఆర్ఎస్ మండల, గ్రా మాల అధ్యక్షులు, సర్పంచులు, ముఖ్య నాయకులు, కా ర్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రామసహాయం కిశోర్‌రెడ్డి, డాక్టర్ పీ సోమేశ్వర్రావు, వివిధ గ్రామాల ఇన్చార్జిలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుంటా..
పాలకుర్తి నియోజకవర్గ విద్యార్థులకు ఎల్లవేళలా తోడుంటానని, కంటికి రెప్పలా కాపాడుకుంటానని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి దయాకర్‌రావును బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో కొడకండ్ల, తొర్రూరు, పెద్దవంగర, దేవరుప్పుల, రాయపర్తి, పాలకుర్తి మండలాల అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలకుర్తి గ్రామీణ ప్రాంత విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు హైదరాబాద్ తరహా కోచింగ్ సెంటర్లను పాలకుర్తి, తొర్రూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలాది మంది విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యంతో పాటు ఖరీదైన మెటీరియల్ ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడి నిష్రమించిన విద్యార్థులకు ఎర్రబెల్లి దయాకర్‌రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 ఐటీ, ఎంఎన్సీ కంపెనీలను నియోజకవర్గానికి తీసుకొచ్చి మెగా జాబ్ మేళాలు నిర్వహించి 4వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించామన్నారు. కరోనా సమయంలో బంధువులు, ఆత్మీయులు దగ్గరకు రాని పరిస్థితుల్లో తమ సొంత డబ్బుతో వైద్యాన్ని అందివ్వడంతోపాటు నియోజకవర్గ ప్రజలందరికీ ఎకడో ఉన్న ఆనందయ్య మందును తెచ్చి ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. పాలకుర్తి మండలానికి ప్రభుత్వ డిగ్రీ, రెసిడెన్షియల్ కళాశాల, ఇంటర్ కళాశాల తీసుకొచ్చామని, కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాల్లో పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్వీ విద్యార్థులు మన అభివృద్ధిని గ్రామగ్రామాన తిరిగి ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గిలకత్తుల సోమశేఖర్‌గౌడ్, కొడకండ్ల, దేవరుప్పుల, రాయపర్తి, పెద్దవంగర, తొర్రూరు మండలాల బీఆర్ఎస్వీ అధ్యక్షులు ధరావత్ రాహుల్గాంధీనాయక్, పందెనబోయిన మధు, సత్తూరి నాగరాజు, పానుగోత్ ప్రదీప్, మేడి రాకేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

