హద్దు దాటితే చర్యలు తప్పవు
విధి నిర్వహణలో హద్దుదాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ సీఐలు, ఎస్సైలను హెచ్చరించారు. శుక్రవారం కాకతీయ యూనివర్శిటీ సమావేశ హాల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆరునెలల నేరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
- పోలీసు స్టేషన్లోనే బాధితులకు న్యాయం చేయాలి
- భూ తగదా కేసుల్లో ఎస్వోపీ అనుసరించాలి : వరంగల్ సీపీ రంగనాథ్
- పోలీసు అధికారులతో ఆరునెలల నేర సమీక్షా సమావేశం
సుబేదారి, జూలై 21 : విధి నిర్వహణలో హద్దుదాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ సీఐలు, ఎస్సైలను హెచ్చరించారు. శుక్రవారం కాకతీయ యూనివర్శిటీ సమావేశ హాల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆరునెలల నేరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు హాజరు కాగా, జోన్, డివిజన్ వారీగా సీపీ సమీక్ష చేశారు. పోలీసు స్టేషన్ల వారీగా ఆరునెలల వ్యవధిలో నమోదైన కేసులు, దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పోలీసు స్టేషన్లోనే న్యాయం చేయాలని ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు.
విధి నిర్వహణలో పారదర్శకంగా ఉండాలని, తప్పుడు కేసులు పెట్టొద్దని హెచ్చరించారు. ప్రతి కేసులో అధికారుల పనితీరుపై సమీక్ష చేస్తామని, తప్పు చేసినట్లు తెలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగదాల్లో తప్పకుండా ఎస్వోపీ విధానాన్ని అనుసరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లాడ్జీలు, వసతి గృహాల నిర్వహణను పర్యవేక్షించాలని, పోలీసుస్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు మురళీధర్, కరుణాకర్, సీతారాం, బారి, పుష్పా, ట్రైనీ ఐపీఎస్ అంకిత పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

