సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Jan 12, 2020 , 03:55:13

పంతులమ్మగా కలెక్టర్‌

పంతులమ్మగా కలెక్టర్‌
  • -విద్యార్థులను ప్రశ్నలు అడిగిన శ్వేతామొహంతి
  • -రంగాపురం హైస్కూల్‌ ఆకస్మిక తనిఖీపెబ్బేరు రూరల్‌ : కలెక్టర్‌ శ్వేతామొహంతి పంతులమ్మగా మారి విద్యార్థులకు పా ఠాలు బోధించారు. మాస్‌కాపీయింగ్‌ చేసి పరీక్షల్లో పాస్‌ కావాలని ఎవరూ ఆశపడొద్ద ని హెచ్చరించారు. శనివారం రంగాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మమేకమయ్యారు. పలు సడ్జెక్టులకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ఏ ప్లస్‌ బీ హోల్‌ స్కేర్‌, రూట్‌ 49, లాగ్‌ 3 వంటి గణితం సబ్జెక్టు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడంతో విద్యార్థులను అభినందించారు. కష్టపడి చదివితేనే జీవితంలో మం చి స్థానం సంపాధిస్తారని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని పాటుపడాలని సూచించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్న నేపథ్యంలో బాగా చదివి ఉత్తీర్ణత సాధించాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.


logo