వికారాబాద్ లో రూ.3.82కోట్లతో నూతన డంపింగ్ యార్డు…

వికారాబాద్, ఆగస్టు:వికారాబాద్ పట్టణంలో 10 ఎకరాల్లో నూతనంగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తున్నట్లు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల వెల్లడించారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు మేకలగండిలో గల నిర్మిస్తున్న డంపింగ్‌యార్డుకు రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు పరిధిలో గోదుమగూడ ప్రధాన రోడ్డు నుంచి డంపింగ్ యార్డు వరకు రూ.18లక్షల 14వ ఆర్థిక ప్రణాళిక నిధులతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ డంపింగ్ యార్డు 10ఎకరాల్లో నిర్మిస్తున్నామని, అందుకు రూ.3.82కోట్ల నిధులు కేటాయించామని అన్నారు. డంపింగ్‌యార్డు పనులు పూర్తి అవగా, షెడ్లు, మిషనరీ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రెండు, మూడు నెలల్లో పెండింగ్ పనులు పూర్తి చేసి డంపింగ్ యార్డును అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్భేగం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, కౌన్సిలర్ సురేశ్, డీఈ రామ్‌కిషన్, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్,తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Vikarabad-two News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

