okra snack : సాధారణంగా బెండకాయలు సగటున కిలో రూ. 50 నుంచి రూ.60 వరకు ఉంటాయి. బెండకాయతో పులుసు, ఫ్రై వంటి కర్రీలతోపాటు బెండీ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటిలో బెండీ స్నాక్స్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటాయి. కానీ, అమెరికాలో మాత్రంమన కరెన్సీలో కిలో రూ.7,200 ధర పలుకుతోంది. ఇంత ధరా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది నిజం.
అమెరికాలో ఉంటున్న ఒక భారతీయుడు ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమెరికాలో ఉంటున్న ఆశిష్ అహుజా అనే ఒక భారతీయుడు అక్కడి ఒక స్టోర్‌కు వెళ్లాడు. అక్కడ బెండకాయ ధర చూడగా షాకయ్యాడు. అక్కడ బెండకాయను కాస్త స్టిక్కీగా ఫ్రై చేసి ప్రీమియమ్ స్నాక్‌గా అమ్ముతున్నారు. దీని ధర ఆరున్నర అమెరికా డాలర్లుగా ఉంది. అది కూడా కేజీ బరువున్న స్నాక్. ఈ స్నాక్ ధరను మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాదాపు రూ.7,200. దీనికి సంబంధించిన వీడియోను అతడు తన సోషల్ మీడియలో షేర్ చేశాడు. ఇంత ధర పెడితే మన దగ్గర దాదాపు ఓ వంద కేజీల ఇలాంటి బెండీ స్నాక్స్ తయారు చేయవచ్చు. మన దగ్గర బెండకాయను చాలా మంది పెద్ద ఇష్టంగా తినరు. కానీ, అమెరికాలో మాత్రం ఇదో లగ్జరీ సూపర్ ఫుడ్‌గా మారిపోయింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అక్కడ ఒక కేజీ బెండి స్నాక్స్ కొనే డబ్బుతో ఇక్కడ ఒక సగటు కుటుంబం నెలంతా భోజనం చేయొచ్చు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పిల్లలకు ఇష్టం లేకున్నా ఇండియాలో బలవంతంగా తినిపిస్తున్న అమ్మలకు థాంక్స్ చెప్పాలంటూ కామెంట్ చేస్తున్నారు.